Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

అల్లు అర్జున్- రష్మిక మరోసారి కలిసి నటించబోతున్నారా? అంటే ‘అవుననే’ అంటోంది బాలీవుడ్ మీడియా. అవును వారి సమాచారం మేరకు.. అది నిజమే అని తెలుస్తుంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ మధ్యనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. దాదాపు రూ.800 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కనుంది ఈ సినిమా. వి.ఎఫ్.ఎక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన కథ, కథనాలతో రూపొందనుందట ఈ సినిమా. మునుపెన్నడూ లేని విధంగా ఇందులో విజువల్స్ డిజైన్ చేస్తున్నారట.

Rashmika, Allu Arjun

అల్లు అర్జున్ కానీ దర్శకుడు అట్లీ కానీ గతంలో ఇలాంటి సినిమా చేయలేదు. ఈ సినిమాలో హీరోయిన్లుగా దీపికా పదుకోనే నటిస్తుంది. మరో ముగ్గురు హీరోయిన్లకి కూడా ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. మృణాల్ ఠాకూర్‌ కూడా ఈ సినిమాలో ఓ నాయికగా ఎంపికైంది. ముంబైలో జరిగిన తాజా షెడ్యూల్లో ఆమె పాల్గొంది. త్వరలోనే ఆమె పాత్రని రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ వదిలే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్టు వినికిడి. అది విలన్ రోల్ అని టాక్. రష్మికకి కూడా ఆ పాత్ర బాగా నచ్చిందట. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా హీరోయిన్. వరుసగా భారీ సక్సెస్ లు అందుకుంటుంది. తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తుంది.

దీంతో అట్లీ సినిమాకి కూడా ఆమె సైన్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ఈ విషయం పై నిర్మాతలు క్లారిటీ ఇవ్వనున్నారు.’సన్ పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. 2026 కి షూటింగ్ కంప్లీట్ చేసి 2027 లో సినిమాని రిలీజ్ చేయాలనే ప్లాన్ తో చిత్రీకరణ నిర్వహిస్తున్నారు.

ప్రముఖ నటుడి కేఫ్‌పై కాల్పులు.. గతంలో చేసిన కామెంట్లే కారణమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus