నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ (Bhagavath Kesari) అనే సినిమా వచ్చింది. 2023 అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శ్రీలీల (Sreeleela) ఇందులో బాలకృష్ణకి కూతురు టైపు పాత్ర చేసింది. ఈ సినిమాలో బాలయ్యని చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఎక్కువగా రాయలసీమ బ్యాక్ డ్రాప్లోనే బాలయ్యని చూపిస్తూ వచ్చారు. కానీ ‘భగవంత్ కేసరి’ లో బాలకృష్ణ పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ కనిపిస్తాడు.
బాడీ లాంగ్వేజ్ కూడా బాగా సెట్ అయ్యింది. యాక్షన్ సన్నివేశాల్లో కూడా బాలయ్య కొత్తగా కనిపిస్తాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో శ్రీలీలతో కలిసి ఫైట్ చేయడం అనేది ఏ సీనియర్ హీరో అప్పటివరకు చేయని విధంగా ఉంటుంది. సినిమా మంచి విజయం సాధించింది. కానీ సంక్రాంతికి వచ్చి ఉంటే ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసి ఉండేది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా దర్శకుడు అనిల్ రావిపూడి పనితనానికి బాలయ్య ఇంప్రెస్ అయిపోయాడు.
సీనియర్ హీరోలతో లేదా స్టార్ హీరోలతో ఎలాంటి సినిమాలు చేయాలో.. వాళ్ళని ఎలా ప్రెజెంట్ చేస్తే ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారో అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందుకే మరోసారి బాలయ్య… అనిల్ తో సినిమా చేయాలని ఆశపడుతున్నాడట. ఆల్రెడీ బాలయ్య ఇమేజ్ కి సూట్ అయ్యే ఒక లైన్ కూడా అనిల్ చెప్పడం జరిగింది. అది బాలయ్యకి కూడా నచ్చింది. ‘అఖండ 2’ (Akhanda 2) తర్వాత గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు బాలయ్య. అటు తర్వాత అనిల్ తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి.