Mahesh Babu: ఫారిన్ ట్రిప్ లో మహేష్..ఫోటో వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన రోజు నుండి ఇప్పటివరకు హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్లలో కొనసాగుతోంది.పరుశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో 170 కోట్లు గ్రాస్ వసులూ చేసింది. సాధారణంగా సెలబ్రిటీలు సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత విరామం తీసుకుని వెకేషన్ కు వెళుతూ ఉంటారు.

అయితే మహేష్ బాబు ఇప్పటివరకు సర్కారు వారి పాట సినిమా సక్సెస్ ఈవెంట్లలో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో శనివారం జరిగిన సర్కారు వారి పాట సక్సెస్ ఈవెంట్ లో ఆయన భార్య నమ్రత కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన సినిమా ఇంత సక్సెస్ కావడానికి కారణమైన ప్రేక్షకులకు, సినిమా యూనిట్ మొత్తానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. తాజాగా మహేష్ బాబు ఫారిన్ టూర్ కి వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశాడు.

ప్రస్తుతం మహేష్ బాబు కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో మహేష్ బాబుటీ షర్ట్, ట్రౌజర్స్, స్నికర్లు , నలుపు రంగు స్పోర్ట్స్ క్యాప్ లో ధరించి స్మార్ట్ గా కనిపిస్తూ కారు దిగుతున్నాడు. అయితే ఈ సారి ఆయన కుటుంబ సభ్యులు ఎవరు తనతో లేకపోవటం గమనార్హం.

ఇదిలా ఉండగా మహేష్ బాబు ఈ సినిమా విడుదలకు ముందు కూడా తన కుటుంబంతో కలిసి పారిస్ లో వెకేషన్ ఎంజాయ్ చేశారు. అయితే ఈసారి మాత్రం మహేష్ బాబూ కుటుంబంతో కాకుండా ఒంటరిగా ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేయటానికి వెళ్తున్నాడు. అయితే మహేష్ బాబు ఎక్కడికి వెళ్తున్నారు అన్న విషయం గురించి తెలియాల్సి ఉంది. మహేష్ బాబు వెకేషన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత త్రివిక్రమ్ తో కలిసి చేయబోయే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏం

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus