స్టార్ హీరోల సినిమాలకు రిలీజ్ డేట్ ప్రకటించిన తరువాత ఆ రిలీజ్ డేట్ లో మార్పులు జరిగితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉండటంతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆ సినిమాలపై ఆసక్తి తగ్గే అవకాశాలు ఉంటాయి. అందుకే చెప్పిన డేట్ కు రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నాలు చేస్తుంటారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాను చెప్పిన డేట్ కు రిలీజ్ చేయాలని రాజమౌళి పట్టుదలతో ఉన్నారు.
ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మారడంతో రాజమౌళి కరోనా జాగ్రత్తలు తీసుకుంటూనే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరిగేలా చూస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో కొత్త టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనుల విషయంలో రాజమౌళి కొంత అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సన్నివేశాలకు సంబంధించి విజువల్ ఎఫెక్ట్స్ కీలకం కావడంతో మరింత మెరుగ్గా పని చేయమని రాజమౌళి గ్రాఫిక్స్ టీమ్ కు ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది.
ఈగ సినిమా నుంచి రాజమౌళి విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ వల్ల రాజమౌళి సినిమాలు ఇతర భాషలతో పాటు విదేశాల్లో కూడా ఆదరణ పొందుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తైతే డబ్బింగ్ తో పాటు ఇతర పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు ఈ సినిమా పై మొత్తం 450 కోట్ల రూపాయలు లాభాలు వచ్చాయని సమాచారం. ఈ 450 కోట్లలో రాజమౌళి, నిర్మాత దానయ్య చెరో 200 కోట్ల రూపాయలు తీసుకుంటారని షూటింగ్ ఆలస్యమైన కారణంగా హీరోలకు, ఇతర సాంకేతిక నిపుణుల కొరకు మిగిలిన 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.