Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అలా చేయబోతున్నారట!

మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతుండటం విషయంలో అభిమానులు తెగ ఫీలవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి వచ్చిన స్థాయిలో ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు సమస్యలు రాలేదు. ఈ సినిమా షూట్ ఆలస్యం కావడంతో మహేష్ రాజమౌళి కాంబో మూవీ మరింత ఆలస్యం అవుతుందని మహేష్ బాబు అభిమానులు తెగ ఫీలయ్యారు. అయితే మహేష్ అభిమానులకు అదిరిపోయే శుభవార్త వెల్లడైంది. జనవరి సెకండ్ వీక్ నుంచి మార్చి లాస్ట్ వీక్ వరకు ఈ సినిమా షూట్ గ్యాప్ లేకుండా జరగనుందని సమాచారం.

సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లోనే ఈ షెడ్యూల్ లాంగెస్ట్ షెడ్యూల్ అని సమాచారం అందుతోంది. సినిమాలోని మేజర్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో షూట్ చేస్తారని దాదాపుగా 60 శాతం షూట్ పూర్తి కానుందని బోగట్టా. జూన్ చివరి వారం సమయానికి ఈ సినిమా షూట్ కంప్లీట్ గా పూర్తవుతుందని తెలుస్తోంది. రామ్ లక్ష్మణ్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్లుగా పని చేస్తుండగా మహేష్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల ఎంపికయ్యారు.

సంక్రాంతి పండుగ కంటే ముందుగానే ఈ సినిమా షూట్ మొదలుకానుంది. శోభన ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా టబు కూడా ఈ సినిమాలో కనిపిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 2023 ఆగష్టు నెలలో లేదా దసరా కానుకగా ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. హారిక హాసిని నిర్మాతలు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మిస్తుండగా భారీ స్థాయిలో ఈ సినిమాకు బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

మహేష్ త్రివిక్రమ్ కాంబో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాల్సి ఉంది. థమన్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ కాగా మహేష్ థమన్ కాంబో బ్లాక్ బస్టర్ కాంబో అనే సంగతి తెలిసిందే.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus