ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్లలో విడుదలై దాదాపుగా ఎనిమిది నెలలైంది. ఈ ఎనిమిది నెలల్లో ఈ సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. కొన్ని వారాల క్రితం జపాన్ లో ఈ సినిమా రిలీజ్ కాగా అక్కడ కూడా ఈ సినిమా కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాహుబలి2 ఫుల్ రన్ కలెక్షన్లను బ్రేక్ చేయడం ద్వారా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రేర్ రికార్డ్ చేరడం ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తోంది.
జపాన్ లో బాహుబలి2 250 మిలియన్ యెన్ కలెక్షన్లను 36 వారాల్లో అందుకోగా కేవలం నాలుగు వారాల్లోనే ఆ రికార్డును ఆర్ఆర్ఆర్ బ్రేక్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ సినిమా రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేసి చరిత్ర సృష్టించడం ఖాయమని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని మరి కొందరు చెబుతున్నారు. రాజమౌళి సినిమా ఏదైనా కలెక్షన్ల విషయంలో అంచనాలను మించి హిట్ అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
జపాన్ కలెక్షన్లతో ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డ్ చేరడంతో పాటు ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు సైతం పెరిగాయి. టాలీవుడ్ సినిమాలు ఇతర దేశాల్లో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఓటీటీలో కూడా సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ఆలోచన ఉందని జక్కన్న చెబుతున్నారు. కథ సిద్ధమైతే అధికారికంగా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ప్రకటన చేసే ఛాన్స్ అయితే ఉంది.
ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్యకు ఈ సినిమాతో భారీ స్థాయిలో లాభాలు దక్కాయి. 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నాన్ థియేట్రికల్ , శాటిలైట్ హక్కుల ద్వారానే దానయ్యకు సగానికి పైగా బడ్జెట్ రికవరీ అయింది. టికెట్ రేట్లు పెంచడంతో ఈ సినిమా దానయ్యకు మంచి లాభాలను అందించింది. ఫస్ట్ డే, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఆర్ఆర్ఆర్ క్రియేట్ చేసిన రికార్డులు ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమేననే సంగతి తెలిసిందే.