Love Story Movie: లవ్ స్టోరీతో చైతన్య ఖాతాలో నయా రికార్డ్!

నాగచైతన్య హీరోగా సాయిపల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమా 2021లో విడుదలైన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లవ్ స్టోరీ కావడం గమనార్హం. సున్నితమైన భావోద్వేగాలతో శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ భావిస్తున్నారు. 35 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా ఈ సినిమా మేకర్స్ కు 15 కోట్ల రూపాయల వరకు వచ్చాయని సమాచారం.

ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను సాధిస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు. యూఎస్ లో లవ్ స్టోరీకి భారీస్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది. క్లాస్ సినిమాలకు యూఎస్ లో మంచి ఆదరణ ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 900 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. యూఎస్ లో ఈ సినిమా 150k అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రాగా కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో యూఎస్ లో సినిమాలేవీ విడుదల కాలేదు.

వకీల్ సాబ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా క్రియేట్ చేసిన రికార్డులను సైతం ఈ సినిమా బ్రేక్ చేసింది. లవ్ స్టోరీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. సాయిపల్లవి, చైతన్య కలిసి నటిస్తున్న తొలి మూవీ లవ్ స్టోరీ కావడం గమనార్హం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus