‘ఆర్.ఆర్.ఆర్’ ప్రాజెక్టుని రాజమౌళి ఏ ముహూర్తాన మొదలుపెట్టాడో కానీ.. ఆరంభం నుండీ కష్టాలు పడుతూనే ఉన్నాడు. ఇద్దరు స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ ప్రాజెక్టుని చేసే బాధ్యతను నెత్తిమీద పెట్టుకుంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో.. మిగతా దర్శకులకు రాజమౌళి ఓ ఉదాహరణగా మారాడు. ప్రాజెక్టు మొదలైనప్పటి నుండీ అడుగడుగునా అతనికి ఇబ్బందులే..! మొదట ఎన్టీఆర్ సరసన నటించాల్సిన హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ తప్పుకుంది. తరువాత ఒలీవా మోరిస్ ను పట్టుకోవడానికి 6నెలల పైనే టైం పట్టింది. మధ్యలో ఎన్టీఆర్, చరణ్ లకు గాయాలు అయ్యి.. మరో 3నెలల పాటు షూటింగ్ ఆగిపోయింది.
ఆ టైములో చరణ్ – అలియా భట్ ల మధ్య షూట్ చెయ్యాల్సిన పార్ట్ క్యాన్సిల్ అయ్యింది.పోనీలే అది చివర్లో చేసుకుందాం అనుకుంటే మధ్యలో కరోనా వచ్చి షూటింగ్ ఆగిపోయేలా చేసింది. ఇప్పుడు షూటింగ్ మొదలుపెడితే అలియా భట్, అజయ్ దేవగన్ వంటి పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ల కాల్షీట్లు దొరకని పరిస్థితి..! మరోపక్క హీరోలు ఎన్టీఆర్, చరణ్ లు.. నా పార్ట్ ముందు కంప్లీట్ చెయ్యి అంటే నా పార్ట్ ముందు కంప్లీట్ చెయ్యి అంటూ .. రాజమౌళి పై ఒత్తిడి చేస్తున్నారట. ఎంత త్వరగా ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఫినిష్ చేస్తే అంత త్వరగా.. వారి తరువాతి ప్రాజెక్టులు సెట్ చేసుకోవచ్చు అని వారి తాపత్రయం కావచ్చు.
అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ మొదలుపెట్టాలి అంటే 300మంది పైనే క్రూతో అవసరం ఉంటుంది. ఇక జూనియర్ ఆర్టిస్ట్ ల షాట్స్ కనుక చెయ్యాల్సి వస్తే.. వేలాది మందితో షూటింగ్ చెయ్యాలి. వాళ్లలో ఒక్కరికి కరోనా వచ్చినా సీన్ మొత్తం రివర్స్ అయిపోతుంది. చరణ్ ఎలాగూ ఇంకో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ‘ఆచార్య’ లో చిన్న పాత్ర మాత్రమే చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ అయితే త్రివిక్రమ్ ప్రాజెక్టుకి కమిట్ అయిపోయాడు. ఇక రాజమౌళి కూడా మహేష్ బాబుతో సినిమా చేస్తున్నట్టు ప్రకటించేశాడు. కాబట్టి వీళ్ళిద్దరి ప్లానింగ్స్ వర్కౌట్ అవ్వడం కష్టమనే చెప్పాలి.
Most Recommended Video
ఇప్పటవరకూ ఎవరు చూడని యాంకర్ లాస్య రేర్ ఫోటో గ్యాలరీ!
సినిమాకి.. సినిమాకి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!