4 ఏళ్ళ తర్వాత గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ విడుదల కాబోతుంది. గోపిచంద్ అభిమానులకు ఇది గుడ్ న్యూసే.ఈ విషయాన్ని తాజాగా నిర్మాతలే తెలియజేసారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మూతపడ్డ థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వారు తెలిపారు. విడుదల తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని వారు చెప్పుకొచ్చారు. అంతా బానే ఉంది.. కానీ ఈ మూవీకి బిజినెస్ జరగడం లేదని లేటెస్ట్ టాక్.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ చిత్రానికి రూ.4 కోట్లకు మించి థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం లేదట. హీరోయిన్ నయనతార కాబట్టి ఈ చిత్రాన్ని తమిళంలో కూడా డబ్ చేసి విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.అలా అనుకున్నా రూ.5 కోట్లకు మించి వెళ్లే అవకాశం కనిపించడం లేదు. ఈ సినిమాకి రూ.18.8 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు నిర్మాతలు.అంతేకాకుండా వడ్డీలతో కలుపుకుని ఇంకా చాలా అయ్యింది. ఆల్రెడీ డిజిటల్ మరియు శాటిలైట్ హక్కులను రూ.8 కోట్లకు జీ వారికి అమ్మేశారట.
4 ఏళ్ళ క్రితం ఈ చిత్రాన్ని రూ.13 కోట్లకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిన బయ్యర్లు ఇప్పుడు మొహం చాటేస్తున్నారు. అప్పుడు ఫైనాన్స్ గొడవలు చోటు చేసుకోవడం వలన సినిమాని విడుదల చేసుకోలేకపోయారు నిర్మాతలు. ఇప్పుడు విడుదలకు క్లియరెన్స్ వచ్చినా.. బిజినెస్ జరగని పరిస్థితి. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు అంటే ఇదేనేమో..!
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!