Operation Valentine Collections: ‘ఆపరేషన్ వాలెంటైన్’ మొదటి వారం ఎంత కలెక్ట్ చేసిందంటే?

వరుణ్ తేజ్ (Varun Tej), మానుషి చిల్లర్ (Manushi Chhillar)  జంటగా నటించిన లేటెస్ట్ మూవీ (Operation Valentine)  ‘ఆపరేషన్ వాలెంటైన్’. తెలుగు-హిందీ భాషల్లో ద్విభాషా చిత్రంగా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రూపొందింది. (Shakti Pratap Singh)  శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. ‘సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్’, ‘సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్’ ‘గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్’ (వకీల్ ఖాన్) సంస్థల పై సిద్దు ముద్ద, నందకుమార్ అబ్బినేని నిర్మించారు. రుహాని శర్మ (Ruhani Sharma) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది.

మార్చి 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే ఈ సినిమా పాజిటివ్ టాక్ లభించింది. కానీ బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో నమోదు కాలేదు.పాజిటివ్ టాక్ వచ్చినా…. వీకెండ్ ను పెద్దగా క్యాష్ చేసుకుంది అంటూ ఏమీ లేదు. వీక్ డేస్ లో మరింతగా డ్రాప్ అయ్యాయి. ఒకసారి ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.99 cr
సీడెడ్ 0.28 cr
ఉత్తరాంధ్ర 0.42 cr
ఈస్ట్ 0.18 cr
వెస్ట్ 0.13 cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.20 cr
నెల్లూరు 0.13 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.49 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.80 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.29 cr (షేర్)

‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) చిత్రానికి రూ.17.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి రూ.17.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. మొదటి వారం కేవలం రూ.3.29 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.14.21 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

గామి సినిమా రివ్యూ & రేటింగ్!

భీమా సినిమా రివ్యూ & రేటింగ్!
వళరి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus