‘బాహుబలి’ చిత్రంతో ప్రభాస్ జాతీయ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ కి తెలుగుతో పాటూ… తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అంతలా ‘బాహుబలి’ చిత్రం ప్రభాస్ ని ఓ రేంజ్ లో కుర్చోపెట్టింది. అయితే ఈ ఫాలోయింగ్ అంతా రాత్రికి రాత్రి వచ్చింది కాదు. ప్రభాస్ ఐదేళ్ళ కష్టార్జితం. మరే చిత్రానికి ఒప్పుకోకుండా.. బాహుబలి చిత్రం కోసం ఐదేళ్ళు కేటాయించాడు. ఈ చిత్రంలో మిగిలిన నటీనటులైన రానా, అనుష్క , తమన్నా లు వేరే సినిమాలు కూడా చేస్తూ బాగా సంపాదించుకున్నప్పటికీ ప్రభాస్ మాత్రం ‘బాహుబలి’ చిత్రానికే కట్టుబడి పనిచేసాడు.
అయితే కేవలం రాజమౌళి డైరెక్షన్లో ‘బాహుబలి’ లాంటి భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తే.. భారీ పారితోషికంతో పాటూ భారీ సక్సెస్ అందుకోవచ్చు.. అనే ఆశతో ప్రభాస్ ఇంతగా సాహసించలేదంట. మరి ఇదంతా దేనికి చేసాడు అనే ప్రశ్నకి ప్రభాస్ నుండీ తాజాగా ఓ షాకిచ్చే సమాధానం వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్ నటించడానికి ముఖ్య కారణం తన తండ్రి కీ.శే.ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు గారు అని ప్రభాస్ తెలిపాడట.
తన కోరిక మేరకే ప్రభాస్ ‘బాహుబలి’ లో నటించాడట. సూర్యనారాయణ రాజు గారు బ్రతికి ఉన్నపుడు ప్రభాస్ ని ఓ రాజుగా చూడాలని కోరుకున్నారట. దీనికోసమే ‘బాహుబలి’ ఆఫర్ జక్కన ఇవ్వగానే వెంటనే ఓకే చేసానని ప్రభాస్ వెల్లడించాడు. ఇదిలా ఉండగా.. ‘బాహుబలి’ రిలీజై అఖండ విజయం సాధించినప్పటికీ అది చూసే భాగ్యం నాన్నగారికి లేకుండా పోయిందంటూ ప్రభాస్ బాధపడ్డాడట. 2010 ఫిబ్రవరి 12న ప్రభాస్ తండ్రి గారైన సూర్య నారాయణ రాజు మరణించారు.
తన తండ్రికి ఇచ్చిన మాట కోసమే ఈ చిత్రం చేయడానికి రెడీ అయితే… తనని అన్ని బాషల ప్రజలకి దగ్గర చేసిందని… ఈ విధంగా తన తండ్రి ఆశీస్సులు ఈ విధంగా దక్కాయని ప్రభాస్ చెప్పుకొచ్చాడట.