Prabhas: ఆర్మాక్స్ సర్వేలో మళ్లీ ప్రభాస్ టాప్.. తర్వాత స్థానాల్లో ఎవరంటే?

ఆర్మాక్స్ సర్వే ప్రతి నెలా వెల్లడించే సర్వే ఫలితాలు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుంటాయి. మోస్ట్ పాపులర్ మేల్ తెలుగు ఫిల్మ్ స్టార్స్ జాబితాను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది. 2024 సంవత్సరం జనవరి నెల సర్వే ఫలితాలలో ప్రభాస్ మళ్లీ టాప్ లో నిలిచారు. ఈ సర్వేలో ప్రభాస్ ఎక్కువగా టాప్ లో నిలుస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారనే చెప్పాలి. భవిష్యత్తులో కూడా ప్రభాస్ టాప్ లో ఉంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

భాషతో సంబంధం లేకుండా ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం (Prabhas) ప్రభాస్ పాలిట వరమైందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో స్టార్ హీరో మహేష్ బాబు రెండో స్థానంలో నిలిచారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా గత నెలలో థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మహేష్ బాబు సెకండ్ ప్లేస్ లో నిలవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలవగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నాలుగో స్థానంలో నిలిచారు. రామ్ చరణ్ ఐదో స్థానంలో, పవన్ కళ్యాణ్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. న్యాచురల్ స్టార్ నాని ఏడో స్థానంలో, రవితేజ ఎనిమిదో స్థానంలో, విజయ్ దేవరకొండ తొమ్మిదో స్థానంలో, చిరంజీవి పదో స్థానంలో నిలిచారు. కొంతమంది టాలీవుడ్ స్టార్స్ కు ఈ జాబితాలో చోటు దక్కలేదు.

ఆర్మాక్స్ సర్వేలో మోస్ట్ పాపులర్ తెలుగు ఫిల్మ్ స్టార్స్ జాబితాలో సమంత తొలి స్థానంలో నిలవగా కాజల్, శ్రీలీల, అనుష్క, సాయిపల్లవి తర్వాత స్థానాల్లో ఉన్నారు. చివరి ఐదు స్థానాలలో రష్మిక, పూజా హెగ్డే, తమన్నా, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు. సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోవడం సాధారణ విషయం కాదని ఫ్యాన్స్ చెబుతున్నారు.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus