వరల్డ్ వైడ్ మూవీ మేకర్స్ ఆస్కార్ అవార్డుని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు అన్న సంగతి తెలిసిందే. నిజజీవితంలో కూడా ఎవరైనా అతిగా మాట్లాడినా, అతిగా ప్రవర్తించినా… ‘ఆస్కార్ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తున్నావ్’ అని సెటైర్ వేస్తుంటారు. ఆస్కార్ కు ఓ సినిమా నామినేట్ అవ్వడమే ఎంతో గగనం అన్న సంగతి తెలిసిందే. విదేశీయుల దృష్టిలో పడితే కానీ ఆస్కార్ కు ఓ ఇండియన్ సినిమాని నామినేట్ చేయడం అంటూ జరగదు.
ఈ మధ్యనే ఆస్కార్ కోసం ‘ఆర్ ఆర్ ఆర్’ టీం రూ.80 కోట్లు ఖర్చు చేసింది అంటూ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి అన్నారు. దీనిపై పెద్ద రచ్చ జరుగుతుంది. ఆయన ఏ ఉద్దేశంతో అన్నా కానీ.. ఆయన అన్న దాంట్లో ఎంతో కొంత నిజమైతే ఉంది.2022 డిసెంబర్ నెలలో నిర్మాత సి.కళ్యాణ్ కూడా అప్పటికి ఆర్.ఆర్.ఆర్ టీం రూ.30 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. విదేశీయుల దృష్టిలో ఇండియన్ సినిమా పడాలి అంటే అంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది.
సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఆ ఆస్కార్ అవార్డు ఎలా ఉంటుంది? .. నిజానికి దీనిని కాంస్యతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఈ అవార్డు తయారు చేయడానికి 400 డాలర్లు ఖర్చవుతుందని సమాచారం. కానీ ఒకవేళ ఈ అవార్డుని అమ్మాలి అనుకుంటే మాత్రం ఒక్క డాలర్ మాత్రమే వస్తుందట.
ఈ అవార్డుని అమ్ముకోవాలని గతంలో ఓ అమెరికన్ డైరెక్టర్ భావించాడు. కానీ అమ్మడం కంటే వేలం వేసి చూద్దాం అని అతను ట్రై చేస్తే ఏకంగా రూ.6 కోట్లు వచ్చాయట. సరే ఈ విషయాలు ఎలా ఉన్నా.. మన ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ వస్తుందో లేదో చూద్దాం.
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్