తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మంచి మార్కెట్ గా అవతరించింది. అక్కడ తెలుగు సినిమాలను చూసేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నారు. అందుకే ఓవర్సీస్ హక్కులను భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. బాహుబలి బిగినింగ్ కి కొనసాగింపుగా వస్తున్న బాహుబలి 2 క్రేజ్ ని దృష్టిలో ఉంచొని అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తం చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారు. ఆయా మొత్తం తిరిగి రాబట్టుకునేందుకు వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు స్పెషల్ షోస్ ద్వారా లాభాలను గడించాలని ప్లాన్ వేశారు.
ఈ షో టికెట్ ధరను 30 డాలర్లు పెట్టారు. సాధారణంగా అక్కడ టికెట్ ధర పది డాలర్లు ఉంటుంది. అమాంతం రెండు రెట్లు పెంచడంతో అమెరికా వాసులు, కెనడా వాసులు (నార్త్ అమెరికాలోని ఓ దేశం) ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు తగ్గించకపోతే బాహుబలి సినిమాను బైకాట్ చేస్తామని షాకిచ్చారు. ఓవర్ సీస్ ఆడియన్స్ ఇచ్చిన షాక్ తో దిగి వచ్చిన డిస్ట్రిబ్యూటర్ లు టికెట్ ధరను 12.25 డాలర్లకు తగ్గించారు. ఇది కేవలం స్పెషల్ షో ధర మాత్రమే. రేపటి నుంచి పది డాలర్లకు మాత్రమే టికెట్స్ విక్రయించనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.