పాకీజా ‘మా’ మెంబర్‌షిప్‌ వార్‌.. కరాటే కల్యాణిపై మెగా ఫ్యాన్స్‌ ఫైర్‌!

మెగా వర్సెస్‌ మంచు.. ఈ ఫ్యాన్ వార్‌ ఇప్పటిది కాదు. ఎంతమంది స్టార్ల ఫ్యాన్ వార్స్‌ వచ్చినా… మంచు అండ్‌ మెగా మధ్య జరిగే టామ్‌ అండ్‌ జెర్రీ వార్‌ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. తాజాగా పాకీజా విషయంలో మెగా వర్సెస్‌ మంచు ఫ్యాన్స్‌ మాటలతో కొట్లాటకు దిగుతున్నారు. అయితే ఈసారి రెండు వైపుల నుండి తొలి మాట రాలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ కరాటే కల్యాణి చేసిన ఓ ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఇప్పుడు ఈ మాటల యుద్ధానికి దారి తీసింది అని చెప్పాలి.

పాత తరం కమెడియన్‌ పాకీజా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆమె ఇబ్బందుల్లో ఉంది అంటూ ఆ మధ్య ఓ వార్త బయటకు వచ్చింది. దీంతో ఆమె సాయం చేయాలని చాలామంది కోరారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీ నుండి రెండు లక్షల రూపాయలు ఆమెకు వెళ్లాయి. అయితే ఆమెకు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) కార్డు లేదని, ఆమెకు ఇస్తే ఇంకా సాయం జరుగుతుందని కూడా వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆమెకు ఆ కార్డును ఉచితంగా ఇస్తున్నారట.

ఆ డబ్బుల్ని మా అధ్యక్షుడు మంచు విష్ణు కడుతున్నారట. అంతేకాదు పాకీజా కష్టంలో ఉందని తెలుసుకున్న మోహన్ బాబు స్వయంగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడారట. తాను అమెరికాలో ఉన్నానని వచ్చిన తరువాత సాయం చేస్తానని మాట ఇచ్చారని కూడా వార్తలొచ్చాయి. ఆ విషయం చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది పాకీజా. ఇప్పుడు విష్ణు సొంత ఖర్చులతో పాకీజాకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని కళ్యాణి ఫేస్ బుక్‌లో షేర్ చేశారు.

‘‘పాకీజా పరిస్థితి చూసి మా అసోసియేషన్ కార్డ్‌కి తన సొంత డబ్బులు కడుతున్నారు మంచు విష్ణు. థాంక్యూ బాబు.. నా మాట పోల్లుపోలేదు’’ అని పోస్ట్‌లో రాసుకొచ్చారు కల్యాణి. అయితే ఆవిడ ఆపదలో ఉంది ఈయన సాయం చేస్తున్నారు.. మధ్యలో మీరు డబ్బా కొట్టుకోవడం ఏంటి? అని కరాటే కల్యాణిని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్‌ ఆమె పోస్ట్‌ కింద కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. పాకీజా గురించి మొదట స్పందించి నాగబాబు లక్ష రూపాయిలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు వారు.

ఆ తరవాత చిరంజీవి కూడా లక్ష రూపాయిలు ఇచ్చారని కామెంట్స్‌ చేస్తున్నారు. కాబట్టి ఇలా డబ్బా కొట్టుకోవద్దు అని ఆమెకు సూచిస్తున్నారు. ఇక మంచు అభిమానులు ఆమెకు సపోర్టు చేస్తూ మాట్లాడుతున్నారు. అలా కల్యాణి పోస్ట్‌ వల్ల మళ్లీ సోషల్‌ మీడియాలో మెగా వర్సెస్‌ మంచు కనిపిస్తోంది. అన్నట్లు మా మెంబర్‌ షిప్‌కి ఎంత కట్టాలో తెలుసాగా.. ఇటీవల ఆ మొత్తాన్ని రూ.90 వేలకు కుదించారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus