టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. వీలైనంత త్వరగా ఆఖరి షెడ్యూల్ ని పూర్తి చేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ అవ్వాలని మహేష్ ప్రణాళికలు రచిస్తున్నారు. అంతేకాకుండా రాజమౌళి దర్శకత్వంలో కూడా మహేష్ మొదటిసారి ఒక బిగ్గెస్ట్ ఫ్యాన్ ఇండియా సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే.
అయితే సర్కారు వారి పాటను మిగతా భాషల్లో కూడా విడుదల చేయాలని ఇటీవల నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ చర్చలు మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. గత వారం ఈ సినిమాను తమిళంలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇక హిందీలో కూడా మహేష్ బాబు కు మంచి క్రేజ్ ఉంది కాబట్టి తప్పకుండా ఈ సినిమా అక్కడ కూడా మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని మహేష్ ను నిర్మాతలు ఒప్పించి హిందీ లో విడుదల చేయాలని అనుకుంటున్నారట.
కన్నడ భాషల్లో కూడా మహేష్ బాబు కు ముందు నుంచి మంచి మార్కెట్ అయితే ఉంది. తమిళంలో కూడా చాలామందికి తెలుసు. ఇక మలయాళంలో మంచి ప్రమోషన్స్ చేసి సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. అయితే సర్కారు వారి పాట సినిమాను సడన్ గా పాన్ ఇండియా అంటే జనాలు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. సాధారణంగా ఒక పాన్ ఇండియా సినిమా అంటే షూటింగ్ మొదలైనప్పటి నుంచే రెగ్యులర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అప్డేట్స్ ఇవ్వాలి.
కానీ సర్కారు వారి పాట సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగుస్తుందన్న సమయంలో పాన్ ఇండియా గురించి ఆలోచిస్తే వర్కవుట్ అవ్వడం కాస్త కష్టమే అని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక సినిమాను మే 12వ తేదీన విడుదల చేయాలని ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను అందుకుంటుందో చూడాలి.