Trivikram: త్రివిక్రమ్ పై ఒత్తిడి పెరుగుతుందా..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో తెరకెక్కుతోన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ‘బాహుబలి’తో మొదలైన ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పైగా మన సినిమాలను నార్త్ జనాలు ఎగబడి చూస్తుండడంతో నిర్మాతలు పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలను నిర్మించి క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అంటే కచ్చితంగా పాన్ ఇండియా రిలీజ్ చేయాల్సిందే. అయితే ఈ విషయంలో దర్శకులపై ఒత్తిడి పెరుగుతోంది. కథ దగ్గరనుంచి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెడుతున్నారు.

దాంతో పాన్ ఇండియా అనేది ఓ ఒత్తిడిలా మారుతుంది. ఇప్పుడు త్రివిక్రమ్ విషయంలో కూడా అదే జరుగుతోంది. ఎప్పుడూ లేనిది కథ విషయంలో త్రివిక్రమ్ మల్లగుల్లాలు పడుతున్నారు. మహేష్ బాబుతో సినిమా విషయంలో ఓ అడుగు ముందుకేస్తుంటే.. పది అడుగులు వెనక్కి లాగుతుండడం.. త్రివిక్రమ్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన కథ ఇంతవరకు సెట్ కాకపోవడానికి కారణం కూడా పాన్ ఇండియా స్ట్రాటజీనే అని తెలుస్తోంది.

స్టార్ హీరో సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో తీయాల్సిందే. మహేష్ బాబు సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా వరకు వెళ్లాలి. అయితే ఇప్పటివరకు త్రివిక్రమ్ అలాంటి స్క్రిప్ట్ రెడీ చేయలేదు. మానవ సంబంధాలు, యాక్షన్, కామెడీ వంటి ఎలిమెంట్స్ తో కథలు రాసుకుంటారు త్రివిక్రమ్. ఇప్పుడు సడెన్ గా వాటిని పాన్ ఇండియా ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చుకోవాల్సి వస్తుంది.

అందుకే మహేష్ కథ సెట్ అవ్వడం లేదని టాక్. ఆ మధ్య మహేష్ బాబుపై ఓ ఫైట్ సీన్ తెరకెక్కించారు. టాకీ మాత్రం మొదలవ్వలేదు. స్క్రిప్ట్ ను లాక్ చేయడంలో లేట్ అవుతుండడంతోనే ఇప్పటివరకు షూటింగ్ మొదలుకాలేదు. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ఉంటుందని అప్డేట్ ఇచ్చారు. మరేం జరుగుతుందో చూడాలి!

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus