బాహుబలి-2ఎలా ఉండబోతుంది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అసలు నిజంగా బాహుబలి చనిపోయాడా లేకపోతే కధలో ఏమైన ట్విష్ట్ ఉందా? ఈ సందేహాలు అన్నీ ప్రేక్షకుల్లో ఉన్నాయి. బహుబలి2 ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న వారిలో ఈ సందేహాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే ప్రముఖ కధా రచయిత ‘పరుచూరి గోపాల కృష్ణ’ ఈ సినిమా కధా రచయిత విజయేంద్ర ప్రసాద్ తో చేసిన ఇంటర్‌వ్యూ లో ఆయన ఈ సినిమా కధను తనదైన శైలిలో, తనకు అనుకున్నది చెప్పాడు. గోపాల కృష్ణ ఊహించుకుని చెప్పిన కధ ఏంటంటే….హీరోయిన్ అనుష్క అందాలు ప్రభాస్, రానాలను ఇద్దరినీ ఆకర్షించడంతో ఇద్దరు అనుష్కతో ప్రేమలో పడతారని అయితే అనుష్కను ప్రేమించే వీరి ప్రయత్నాలు అనుష్క వల్ల వారిద్దరి మధ్య పగ మరింతగా పెరుగుతుందని చెబుతూనే, రెండు లైన్స్ కన్నా ఎక్కువగా లేని ఆ కధకు అంత హైప్ అవసరమా అంటూ విజయేంద్ర ప్రసాద్ పై శెటైర్స్ వేశాడు పరుచూరి సోదరుడు.
అదే క్రమంలో పరుచూరి వారు సినిమా సీక్రెట్ ఒకటి బయట పెట్టాడు, అదేమిటంటే, ఆస్తి కోసం, అమ్మాయిల కోసం పోరాడే కథాంశంతో వచ్చే చిత్రాలు ఎప్పుడూ హిట్ అవుతాయని అందుకే ఎక్కువ మంది దర్శకులు వాటినే ఎన్నుకుంటారని తెలిపాడు. ఇక పరుచూరి చెప్పిన కధను విని విజయేంద్ర ప్రసాద్ నవ్వుతూ…కంగారు ఎందుకు, వచ్చే ఏడాది వరకూ ఆగితే సినిమా విడుదల అవుతుంది అప్పుడు చూడండి అని తెలుపడం విశేషం. ఏది ఏమైనా…అసలు బాహుబలి-2 విషయం ఏంటో తెలియాలంటే మనం వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే.