ఈ ఏడాది విడుదలై విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ఓరి దేవుడా మూవీ బాక్సాఫీస్ వద్ద అబవ్ యావరేజ్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఓరి దేవుడా సినిమాలోని వెంకటేష్ పాత్రపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. వెంకటేష్ పాత్ర మరీ రొటీన్ గా ఉందని ఆ పాత్ర ఆయన రేంజ్ పాత్ర కాదని ఎక్కువమంది చెబుతున్నారు. ఓ మై కడవులే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాకు ఓరి దేవుడా అనే టైటిల్ పెట్టడం మిస్టేక్ అని పరుచూరి గోపాలకృష్ణ కామెంట్లు చేశారు. ఓరి దేవుడా సూపర్ హిట్ కావాల్సిన సినిమా అని ఈ సినిమాలో అలాంటి తప్పులు వచ్చాయని పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయం వ్యక్తం చేశారు. చిన్ననాటి ఫ్రెండ్స్ మధ్య జరిగిన అద్భుతమైన ప్రేమ కథ ఓరి దేవుడా అని పరుచూరి కామెంట్లు చేశారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ మాత్రం థ్రిల్ కు గురి చేస్తుందని ఆయన అన్నారు.
సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యే విధంగా స్క్రీన్ ప్లేను సిద్ధం చేసుకుని ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హీరో వెంకటేష్ మంచి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ అని అయితే ఆయనను ఆయన స్థాయి కంటే తక్కువ స్థాయిలో చూపించారని పరుచూరి పేర్కొన్నారు. ఈ సినిమా ఆకాశం అంచుల వరకు వెళ్లాల్సిన మూవీ అని అయితే మధ్యలోనే ఆగిపోయిందని ఆయన వెల్లడించారు.
ఓరి దేవుడా సినిమా గురించి పరుచూరి ఇచ్చిన రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఓరి దేవుడా మంచి ప్రయత్నమని పరుచూరి తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ తరహా నటుడు నటించాల్సిన పాత్రలో వెంకటేష్ నటించాడని ఆయన అభిప్రాయపడ్డారు. పరుచూరి గోపాలకృష్ణ చేసిన కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.