Paruchuri Gopala Krishna: ఫ్యామిలీ స్టార్ అందుకే ఫ్లాపైందన్న పరుచూరి.. చెప్పిన విషయాలివే!
- June 3, 2024 / 09:11 AM ISTByFilmy Focus
కొన్ని సినిమాలు ఒకింత భారీ అంచనాలతో విడుదలై నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగుల్చుతుంటాయి. అలా ఈ ఏడాది భారీ అంచనాలతో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోని సినిమాగా ఫ్యామిలీ స్టార్ (The Family Star) నిలిచింది. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ఈ సినిమాతో హ్యాట్రిక్ సాధిస్తారని ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా ఆమె హ్యాట్రిక్ కు బ్రేకులు వేసింది. విజయ్ దేవరకొండ Vijay Deverakonda) ఈ సినిమాతో గీతా గోవిందం (Geetha Govindam) మ్యాజిక్ ను రిపీట్ చేస్తారని భావిస్తే ఆ మ్యాజిక్ రిపీట్ కాలేదు.
దర్శకుడు పరశురామ్ కు (Parasuram) మాత్రం ఈ సినిమా విషయంలో వ్యక్తమైన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఆయన ఇమేజ్ ను ఈ సినిమా ఊహించని స్థాయిలో డ్యామేజ్ చేసిందనే చెప్పాలి. ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ కావడానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో కారణాలు వినిపించాయి. సెకండాఫ్ ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణమని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) సైతం ఈ సినిమా ఫ్లాప్ రిజల్ట్ కు సంబంధించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.

పరుచూరి గోపాలకృష్ణ ఒకింత ఆలస్యంగానే ఈ సినిమా రివ్యూ ఇచ్చినా ఆయన ఇచ్చిన రివ్యూ మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండకు సూట్ అయ్యే కథ అని స్క్రీన్ ప్లేలో విజయ్ బాడీ లాంగ్వేజ్ ను దాటి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల రిజల్ట్ మారిందని పరుచూరి పేర్కొన్నారు. సెకండాఫ్ లో 15 నిమిషాల సీన్స్ తీసేసి ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

మూవీ సెకండాఫ్ లో హీరో కుటుంబానికి హీరోయిన్ సాయం చేయడంతో హీరోయిన్ గ్రాఫ్ పెరిగిందని పరుచూరి అభిప్రాయపడ్డారు. హీరో తన అహంతో హీరోయిన్ ను దూరం చేసుకోవడం ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదని ఆయన తెలిపారు. కోమా స్టేజ్ లో ఉన్న వ్యక్తితో హీరోయిన్ పెళ్లి చేయాలని భావించడంతో సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే గ్రిప్ తగ్గిందని పరుచూరి పేర్కొన్నారు. పరుచూరి చేసిన కామెంట్లతో నెటిజన్లు సైతం ఏకీభవిస్తూ ఉండటం గమనార్హం.















