Pawan Kalyan, Chiranjeevi: ‘బాస్ పార్టీ’ పాటపై పవన్ ఏమన్నారంటే?

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ చాలా రోజుల తర్వాత ఒకేఫ్రేములో కనిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. చిరు వరుస సినిమాలు.. పవన్ అటు పాలిటిక్స్ ఇటు మూవీస్‌తో ఫుల్ బిజీగా ఉండడంతో.. ఈమధ్య మెగా బ్రదర్స్ ఇద్దరూ కలవడం కుదరట్లేదు. కట్ చేస్తే.. మంగళవారం అన్నదమ్ములిద్దరూ కలుసుకున్న పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత తన మార్క్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ‘వాల్తేరు వీరయ్య’ చేస్తున్నారు.

బాబీ డైరెక్టర్.. శృతి హాసన్ హీరోయిన్.. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.. టైటిల్ టీజర్‌కి మంచి రెస్పాన్స్‌తో పాటు అంచనాలు కూడా పెరిగాయి.. ‘వాల్తేరు వీరయ్య’ ఆల్బమ్ నుండి ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ ఇస్తూ.. ‘బాస్ పార్టీ’ ప్రోమో వదిలారు. ఈ ‘బాస్ పార్టీ’ ఫుల్ సాంగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వినిపించారు చిరు. బాస్ వెంట డైరెక్టర్ బాబీ కూడా ఉన్నారు.

అయితే పవన్, అన్నయ్య సినిమా షూటింగ్ స్పాట్‌కి వెళ్లారా?.. లేక చిరు తమ్ముడి సెట్స్‌కి వచ్చారో తెలియదు కానీ పవన్‌తో పాటు ‘హరి హర వీరమల్లు’ డైరెక్టర్ క్రిష్, ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం ఉన్నారు. దేవి శ్రీ ట్యూన్ కంపోజ్ చేయడంతో పాటు లిరిక్స్ రాశారు. నకాష్ అజీజ్, హరిప్రియలతో కలిసి డీఎస్పీ కూడా పాడారు. ‘బాస్ పార్టీ’ ఫుల్ సాంగ్ విన్న పవన్.. సాంగ్ చాలా బాగుందని.. దేవి మరోసారి తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయబోతున్నాడనిపిస్తుందని..

మాస్ బీట్‌తో సాగే సాంగ్ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని చెప్పడంతో పాటు, సాంగ్ కొరియోగ్రాఫర్ తదితర వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. యంగ్ డ్యాన్సింగ్ సెన్సేషన్ శేఖర్ మాస్టర్ ‘బాస్ పార్టీ’ కి స్టెప్స్ కంపోజ్ చేశారు. నవంబర్ 23 సాయంత్రం 4:05 గంటలకు పూర్తి పాట రిలీజ్ కానుంది.. 2023 సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’గా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు మెగాస్టార్..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus