Pawan Kalyan: పవన్‌ కెరీర్‌లో అరుదైన పని చేయబోతున్నాడా..!

‘భీమ్లా నాయక్‌’ అయిపోయింది పవన్‌ ఇక ‘హరి హర వీరమల్లు’ సినిమా మొదలుపెట్టేస్తాడు. త్వరలో ఆ సినిమాను కూడా చూసేయొచ్చు అని అనుకుంటున్నారు ఫ్యాన్స్‌. పవన్‌ను తొలిసారి హిస్టారికల్‌ క్యారెక్టర్‌లో చూడాలనేది వారి కోరిక. అయితే ఇక్కడ త్రివిక్రమ్‌ రాస్తున్న స్క్రీన్‌ప్లే మరోలా ఉంది అని టాక్‌. ఈపాటికి ఆ లెక్క ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అదే తమిళ సూపర్‌ హిట్‌ చిత్రం ‘వినోదాయ చిత్తాం’. సముద్ర ఖని ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమా తెలుగులోకి వస్తుందని టాక్‌. దీని గురించి పవన్‌ లైనప్‌ మారుస్తున్నారట.

సముద్రఖని ప్రధాన పాత్రలో నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘వినోదాయ చిత్తాం’. దేవుడు, మనిషి కాంబినేషన్‌లో ఈ సినిమా రూపొందింది. చనిపోయిన వ్యక్తి, తిరిగి భూమికి వచ్చి ఏం చేశాడు, ఈ క్రమంలో దేవుడు ఏం చేశాడు అనేది సినిమా. ఈ కాన్సెప్ట్‌లో గతంలో మన దగ్గర కొన్ని సినిమాలు వచ్చినా… ఈ సినిమా నడిచే విధానం ఆకట్టుకుంటుంది. అందుకే ఈ సినిమాను తెలుగులోనూ తీయాలని పవన్‌ కల్యాణ్‌ – త్రివిక్రమ్‌ అనుకుంటున్నారట. ఇందులో పవన్‌ కల్యాణ్‌ – సాయితేజ్‌ నటిస్తారని టాక్‌.

ఇక్కడి వరకు ఓకే… అయితే ఈ సినిమా ఎప్పుడు షూట్‌ చేస్తారు అనేదే విషయం. ఎందుకంటే పవన్‌ సినిమాల లైనప్‌ బిజీ బిజీగా ఉంది. క్రిష్‌ ‘హరి హర వీరమల్లు’, హరీశ్‌ శంకర్‌ ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ ఉన్నాయి. దీని తర్వాత రామ్‌ తాళ్లూరి – సురేందర్‌ రెడ్డి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ లైనప్‌ మధ్యలోకి ‘వినోదాయ చిత్తం’ సినిమా వస్తోందట. ‘హరి హర వీరమల్లు’ సినిమాతోపాటుగా ‘వినోదాయ…’ చిత్రీకరిస్తారని సమాచారం.

వచ్చే ఉగాదికి సినిమాను ప్రారంభించి… వీలైనంత త్వరగా పవన్‌ కల్యాణ్‌ పోర్షన్‌ను పూర్తి చేయాలని చూస్తున్నారట. సుమారు 20 రోజుల్లోనే పవన్‌ సీన్స్‌ పూర్త చేసేస్తారని అంటున్నారు. మిగిలిన రోజుల్లో సాయితేజ్‌ సీన్స్‌, మిగిలినవి పూర్తి చేస్తారట. ఇక ఈ సినిమాకు రచన, స్క్రీన్‌ప్లే విషయంలో త్రివిక్రమ్‌ మరోసారి పని చేస్తారట. దర్శకత్వ బాధ్యతను మాతృకను తెరకెక్కించిన సముద్ర ఖనినే తీసుకుంటున్నారు. అంతేకాదు ఈ సినిమాకు త్రివిక్రమ్‌ సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తారట. పవన్‌ ఒకేసారి రెండు సినిమాలు చేయడం చాలా అరుదు. ఇప్పుడు ఈ సినిమా గురించి చేస్తున్నాడట.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus