Chiranjeevi, Pawan Kalyan: వైరల్ అవుతున్న పవన్ ఎమోషనల్ పోస్ట్!
- August 22, 2021 / 10:29 PM ISTByFilmy Focus
స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తో హిట్ కొట్టిన పవన్ హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ లతో బిజీగా ఉన్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చిరంజీవి తనకు మాత్రమే కాదని ఎంతోమందికి మార్గదర్శి అని పవన్ కళ్యాణ్ అన్నారు.
చిరంజీవి తమ్ముడిగా పుట్టడం అదృష్టం అయితే ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరింత అదృష్టమని పవన్ చెప్పుకొచ్చారు. చిరంజీవి అభిమానులలో తాను తొలి అభిమానినని కనులారా తాను మెగాస్టార్ సక్సెస్ ను చూశానని ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం చిరంజీవి ప్రత్యేకత అని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. కరోనా సమయంలో సినిమా కార్మికుల ఆకలిని తీర్చడం కొరకు చిరంజీవి ఎంతో తపన పడ్డారని కష్టాల్లో ఉన్నవాళ్ల ఆకలిని తీర్చి చిరంజీవి పెద్ద మనసును చాటుకున్నాడని పవన్ అన్నారు.

చిరంజీవి తనకు అన్న అయినప్పటికీ తండ్రిలా సాకారని అన్నయ్య చిరాయువుతో చిరంజీవిగా భాసిల్లాలని అన్నయ్యకు ఆయురారోగ్యాలతో కూడిన దీర్ఘాయుష్షును దేవుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. చిరంజీవి గురించి ఎంత చెప్పినా ఇంకా కొన్ని మిగిలే ఉంటాయని ఎన్నో విజయాలు, రికార్డులు సాధించినా అదే వినమ్రతతో ఉండటం చిరంజీవి సొంతమని పవన్ చెప్పుకొచ్చారు. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవడంలో చిరంజీవి ముందుంటారని పవన్ తెలిపారు.
Most Recommended Video
చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!















