రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ పవర్ స్టార్ మూవీ పోస్టర్స్, వర్కింగ్ స్టిల్స్ దారుణంగా ఉన్నాయి. ఆయన ఓ వైపు పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ…ఇది జస్ట్ యాదృచ్చికమే… నా పవర్ స్టార్ మీరు అనుకుంటున్న స్టార్ కాదు అంటున్నాడు. ఇక ఆదివారం ఆయన విడుదల చేసిన గడ్డితింటావా సాంగ్ మరింత దారుణంగా ఉంది. ఇవన్నీ గమనిస్తున్న పవన్ ఫ్యాన్స్ కి బాగా కాలినట్టుంది. దీనితో వర్మకు తిక్కకు సమాధానంగా, మనం కూడా ఆయనపై మూవీ తీయడమే అని డిసైడ్ అయ్యారు.
పరాన్నజీవి ట్యాగ్ లైన్ లో రెక్లెస్ జెనెటిక్ వైరస్ అనే పేరుతో ఓ మూవీ చేస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆర్ జి వి ని ఉద్దేశిస్తూ దారుణమైన లిరిక్స్ తో ఓ సాంగ్ వదిలారు. అలాగే మరో దర్శకుడు పార్న్ జీవి ట్యాగ్ లైన్ లో భార్య వదిలేసిన ఓ దర్శకుడి కథ అంటూ పోస్టర్ విడుదల చేశారు. పవన్ ఫ్యాన్స్ ఈ విధంగా వర్మ భాగోతం బయటపెడతాం అంటున్నారు. ఇతరుల జీవితాలతో ఆడుకొనే వర్మకు తమతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాం అని అంటున్నారు.
మరి ఈ రెండు చిత్రాలలో వర్మ జీవితాన్ని వారు ఎలా చిత్రీకరిస్తారు అనేది చూడాలి. ఏ విషయాన్నీ అయినా సిల్లీగా తీసుకొనే వర్మ మరి వీటిపై ఎలా స్పందిస్తాడో చూడాలి. ఆ మూవీలు చూసిన వర్మ ‘నా జీవితం ఇంకా ఛండాలంగా ఉంటుంది, వీరు తక్కువ చూపించారు…అడిగితే చెప్పే వాడిని కదా’ అనే రకం. రచయిత జొన్నవిత్తుల కూడా ఆర్ జి వి ట్యాగ్ లైన్ లో రోజూ గిల్లేవాడు అంటూ మూవీ చేస్తున్నాడు. ఆ మూవీ ఎంత వరకు వచ్చిందో తెలియదు. ఏది ఏమైనా, ఎవరు ఏమన్నా ఆర్ జి వి తన చిత్రాలను ఫ్రీ గా ప్రమోట్ చేసుకోవడానికి వాడుకుంటాడు.