‘వకీల్‌సాబ్’ సినిమా పవన్ ఫ్యాన్స్ అంటే ఏంటో చూపిస్తోంది. ఏంటి మళ్లీ ఇంకో అభిమాని రక్తంతో స్క్రీన్ మీద పేరు రాశాడు అనుకుంటున్నారా? సర్లే ఊరుకోండి.. అందరూ అలానే ఉంటారా ఏంటి? అయినా ఎప్పుడూ అలాంటి అభిమానుల గురించే చెబుతామా ఏంటి… మంచి పనులు చేసే అభిమానులు కూడా ఉంటారు కదా. అందుకే ఈ రోజు కొంతమంది అభిమానులు చేసిన మంచి పనిని కూడా చూపిద్దాం అనుకుంటున్నాం. ఈ వీడియో చూస్తే… ఈ అభిమానులు చాలా మంచోళ్లు అనిపిస్తుంది కూడా.
కొత్త సినిమా విడుదలైతే థియేటర్ల దగ్గర సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిన విషయమే. మల్టీ ప్లెక్స్‌లకు వెళ్లేవాళ్లకు ఈ విషయం తెలియదు కానీ… సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా చూసే అలవాటు ఉన్నవాళ్లకు కచ్చితంగా తెలుస్తుంది. థియేటర్‌కి వచ్చినవాళ్లు, సందడి చూడటానికి వచ్చినవాళ్లు ఇలా అందరూ రోడ్డు మీద నిలిచిపోతారు. ‘వకీల్‌సాబ్’ సినిమా విషయంలోనూ ఇదే జరిగింది. మీరు కూడా కొన్ని థియేటర్ల దగ్గర ఇది చూసేఉంటారు. అలాంటి సమయంలో ఓ అంబులెన్స్ అటుగా వస్తే దాటడం కష్టమే. కానీ పవన్ అభిమానులు ఎంతో క్రమశిక్షణతో ఆ అంబులెన్స్ దారి చేసి ఇచ్చారు. ఇదీ ఆ వీడియో కథ.
ఈ వీడియో ఎక్కడది, ఎవరు తీశారనే విషయంలో స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఫ్యాన్స్ హడావుడితో ఆ ఏరియా నిండిపోయింది. ఈలోగా అటువైపుగా ఆంబులెన్స్ వచ్చింది. దానిని గమనించిన అభిమానులు వెంటనే స్పందించి… ఆ రోడ్డును ఖాళీ చేస్తూ అంబులెన్స్‌కి దారిచ్చారు. ఆ వీడియోను కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. గతంలోనూ చాలామంది ఇలా చేసినా… అభిమానం వెర్రితలలుగా మారుతోంది అనే విమర్శలు వస్తున్న సమయంలో ఇది ఆసక్తికరమే.
జనసేన అధినేత,పవర్ స్టార్ @PawanKalyan గారి #VakeelSaab థియేటర్ వద్ద సందడి.
ఈ వేళలో బిజీగా ఉన్నా సరే ఆ రూట్లో ఒక🚑అంబులెన్స్ రావడంతో ఖాళీ చేయించిన జనసైనికులు.
సినిమా మాకు వినోదం.
‘ప్రజాసేవ మా భాద్యత’అని మరోసారి నిరోపించిన జనసైనికులు అందరికీ ధన్యవాదములు🔯🙏#BlockBusterVakeelSaabpic.twitter.com/NisNyQbuCS