పవన్ కళ్యాణ్ అభిమానులు తన భార్యపై అనుచితవ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ భార్యపై, ఆయన వ్యక్తిగత జీవితంపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ని టార్గెట్ చేస్తూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండడంతో పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్దకు చేరుకున్నారు. పోసానిపై దాడి జరిగే అవకాశం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రెస్ క్లబ్ వద్ద గుమికూడి పోసానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడితే అంతు చూస్తామని హెచ్చరించారు. పోలీసులు పలువుర్ని అక్కడికక్కడే అరెస్ట్ చేసి తరలించారు. అయినా మరికొంతమని గూమికూడటంతో పోసానిని సొంతకారులో వెళ్లేందుకు పోలీసులు అంగీకరించలేదు. ప్రెస్ క్లబ్ లో మాట్లాడడం పూర్తయిన తరువాత పోలీసులు పోసానికి బయట పరిస్థితిని వివరించి కాసేపు లోపలే ఉంచారు. తరువాత ఆయన కారులో వెళ్లడం సేఫ్ కాదని భావించిన పోలీసులు తమ కారులోనే ఇంటిదగ్గర దిగబెట్టాలని నిర్ణయించారు.
ఆయనకు భద్రత కల్పించి కారులో కూర్చోబెట్టి ఇంటివైపు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా పోసాని.. తనకు ఏమైనా అయితే పవన్ కల్యాణ్‌దే బాధ్యత అని ప్రకటించారు. తాను పవన్ కళ్యాణ్ పై కేసు పెడతానని హెచ్చరించారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!