‘వకీల్ సాబ్’ (Vakeel Saab) తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 27వ సినిమాగా ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veera Mallu) మొదలైంది. క్రిష్ (Krish Jagarlamudi)దర్శకత్వంలో మొదలైన ఈ సినిమాకి ఏ.ఎం.రత్నం (AM Rathnam) నిర్మాత. 5 ఏళ్ళు అయినా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. దర్శకుడు క్రిష్ మధ్యలో ‘కొండపొలం’ (Konda Polam) చేశాడు. అనుష్కతో (Anushka Shetty) ‘ఘాటి’ (Ghaati) కూడా కంప్లీట్ చేశాడు. ఎన్నికల సమయంలో పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ మరింతగా హోల్డ్ లో పడింది.
అందువల్ల క్రిష్ తప్పుకోవడం… అతని స్థానంలో ఏ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ (Jyothi Krishna ) దర్శకత్వ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. వాస్తవానికి మార్చి 30న ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ప్రకటించారు. తర్వాత మే 9 కి ఫిక్స్ అన్నారు. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం లేదు. మరోపక్క రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్లో తిరిగి జాయిన్ అయినట్టు ప్రకటించారు. ఇక తాజాగా పవన్ షూటింగ్ కంప్లీట్ చేసేసినట్టు కూడా ప్రకటించేశారు.
‘హరిహర వీరమల్లు’ షూటింగ్ 5 రోజులు పెండింగ్ ఉన్నట్టు.. మొన్నటి వరకు ప్రచారం జరిగింది. అలాంటప్పుడు 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎలా కంప్లీట్ చేసేశారు? ఇది అంతుచిక్కని ప్రశ్న. బహుశా డూప్ ను పెట్టి బ్యాలెన్స్ పార్ట్ ఫినిష్ చేశారేమో అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఏదైతేనేం.. ఇక ‘హరిహర వీరమల్లు’ కి పవన్ ప్యాకప్ చెప్పేసినట్టే. త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.