పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు లేడీ ఫ్యాన్స్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రీఎంట్రీలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటించడం విషయంలో అభిమానులలో ఒకింత అసంతృప్తి ఉందనే సంగతి తెలిసిందే. పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా తేరి రీమేక్ అని తెలిసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెగ ఫీలవుతున్నారు.
వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించినా రీమేక్ లకు ఈ మధ్య కాలంలో ఆదరణ అంతకంతకూ తగ్గుతోంది. పవన్ మళ్లీ రీమేక్ లో నటిస్తున్నారనే విషయం తెలిసి ఆయన అభిమానులు తెగ ఫీలవుతున్నారు. తేరి రీమేక్ వద్దంటే వద్దు అంటూ ట్విట్టర్ లో రెండు లక్షల ట్వీట్లతో ఈ మూవీ రీమేక్ గురించి ట్రెండింగ్ అయింది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తేరి రీమేక్ లో పవన్ నటించడం కరెక్ట్ కాదని భావిస్తున్నారు.
దివ్యశ్రీ అనే లేడీ అభిమాని ఒకరు ఏకంగా ఇప్పటివరకు ఒక్క లెటర్ కూడా రాయని నేను ఇలా లెటర్ రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఎన్ని రీమేక్ సినిమాలలో నటించినా నేను ఫీల్ కాలేదని అయితే తేరి రీమేక్ అని తెలిసిన తర్వాత ఈ లెటర్ రాయక తప్పడం లేదని నా చావును చూసైనా తేరి రీమేక్ ను క్యాన్సిల్ చేస్తారని అనుకుంటున్నానని పేర్కొన్నారు.
తేరి మూవీ తెలుగు వెర్షన్ స్టార్ మా ఛానల్ లో తరచూ ప్రసారమవుతోందని ఈ ప్రాజెక్ట్ ను క్యాన్సిల్ చేయాలని దివ్యశ్రీ కోరారు. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దని అభిమాని చెప్పుకొచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, దర్శకుడు హరీశ్ శంకర్ తన చావుకు కారణమని లేడీ ఫ్యాన్ సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఈ సూసైడ్ నోట్ గురించి మైత్రీ నిర్మాతలు, హరీష్ శంకర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.