టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన పవన్ కల్యాణ్ మంచి హీరో మాత్రమే కాదు. మంచి సంఘ సంస్కర్త కూడా. అదే క్రమంలో ఎన్నో సేవా కార్యక్రమాల్లో సైతం పవన్ పాల్గొంటు ఉంటారు. ఎక్కడైనా ప్రకృతి కోపం దాల్చి నష్టం జరిగితే అక్కడ వెంటనే పవన్ ప్రత్యక్షం అయ్యి, వారికి సహాయం చేయడం పవన్ కు అలవాటు. అదే క్రమంలో పవన్ పుస్తక ప్రియుడు. ఇక పవన్ కు అత్యంత ఆప్తుడైన త్రివిక్రమ్ పవన్ కు చదవమని ఒక బుక్ ఇవ్వగా, ఇంకో బుక్ కోసం పవన్ త్రివిక్రమ్ కు అడగగా, మరో బుక్ లేదు అని చెప్పడంతో చలించిపోయిన పవన్, వెంటనే..స్వయంగా తన ఖర్చులతో రీప్రింట్ చేయించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే.
ఆ పుస్తకమే గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన మహా గ్రంధం ఆధునిక మహా భారతం. అయితే ఈ పుస్తకం పవన్ ను ఎంతో ప్రభావితం చేసిందని తెలుస్తుంది. తన మదిలోని భావాలని పవన్ ఒక లేఖ రూపంలో తెలుపుతూ….”ఒక దేశపు సంపద ఖనిజాలు కాదు, నదులు కాదు, అరణ్యాలు కాదు… కలలు ఖనిజాలతో చేసిన యువత, మన దేశ భవిష్యత్తుకు సేవకులు”, అన్న ‘మహాకవి శేషేంద్ర గారి మాటలు ఆయన్నంత అమితంగా ఇష్టపడేలా చేసినాయి. అంటూ తెలపడం నిజంగా పవన్ కల్యాణ్ మంచి మనసుకి అద్దం పడుతుంది. అంతేకాకుండా ఈ పుస్తకంలో శర్మ గారు రచించిన వాఖ్యాల్లో ‘నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందా?’ అన్న ఆయన వేసిన ప్రశ్న నాకు ‘మహావాక్యం’ అయింది అంటున్నాడు పవన్. ఏది ఏమైనా…పవన్ నువ్వు నిజంగా పవర్ స్టార్ వే….