Pawan Kalyan: ఆ ఊరి మహిళలకు సారె పంపిన పవన్ కళ్యాణ్.. అసలేమైందంటే?
- August 29, 2024 / 07:13 PM ISTByFilmy Focus
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ఫలితాల తర్వాత తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రశంసలు పొందుతున్న సంగతి తెలిసిందే. పిఠాపురం మహిళలకు పవన్ కళ్యాణ్ ఏకంగా 12 వేల చీరలను స్పెషల్ గిఫ్ట్ గా తన సొంత డబ్బులను ఖర్చు చేసి పంపారని సమాచారం అందుతోంది. సామూహిక వరలక్ష్మీ వ్రతాలు చేస్తున్న మహిళలకు ఈ చీరలను అందజేయనున్నారు. తన నియోజకవర్గ ఆడపడుచులకు చీరలతో పాటు వ్రత సామాగ్రి పంపించడం ద్వారా పవన్ కళ్యాణ్ సారె పంపి వార్తల్లో నిలిచారు.
Pawan Kalyan

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మనస్సు మంచి మనస్సు అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పిఠాపురంలో ఉన్న పురూహుతికా అనే దేవాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు ఈ నెల 30వ తేదీన జరగనున్నాయి. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ చీరలు, వ్రత సామాగ్రి పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను చూసుకుంటున్నారని సమాచారం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం చివరి శుక్రవారం రోజున ఈ ఆలయంలో మహిళలు వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు.

12000 చీరలలో 6000 చీరలను పసుపు కుంకుమతో కలిపి అమ్మవారి ప్రసాదంగా ఆలయం దగ్గర పూజ పుర్తైన తర్వాత పంపిణీ చేస్తారని మిగతా చీరలను చేబ్రోలు పార్టీ ఆఫీస్ లో ఆడపడుచులకు ఇస్తారని తెలుస్తోంది. మరోవైపు సెప్టెంబర్ 2వ తేదీన పవన్ పుట్టినరోజు కానుకగా గబ్బర్ సింగ్ (Gabbar Singh) మూవీ రీరిలీజ్ అవుతోంది. పవన్ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన క్రేజీ అప్ డేట్స్ వచ్చే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

పవన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల కంటే రాబోయే రోజుల్లో రాజకీయాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ నుంచి కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు మాత్రం వెలువడే ఛాన్స్ అయితే లేనట్టేనని చెప్పవచ్చు.

















