టాలీవుడ్ లో ప్రస్తుతం ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల స్థాయిలో పారితోషికం తీసుకుంటుండగా సినిమా సక్సెస్ సాధిస్తే నిర్మాతలకు భారీస్థాయిలో లాభాలు వస్తున్నాయి. అయితే పవన్ ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి మద్దతు ఇవ్వలేదు.
2019 ఎన్నికల్లో జనసేన పార్టీకి ఏపీలో కేవలం ఒక అసెంబ్లీ స్థానం మాత్రమే దక్కింది. ఏపీలో బలమైన ప్రతిపక్ష పార్టీగా జనసేనను నిలిపేందుకు పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారనే విషయం తెలిసిందే. పవన్ నటిస్తున్న భీమ్లా నాయక్, హరిహర వీరమల్లు వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ కానున్నాయి. హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ హీరోగా తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమా షూటింగ్ త్వరలో మొదలుకానుంది.
అయితే పవన్ ఈ సినిమాలు మినహా కొత్త సినిమాల జోలికి పోకూడదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా ఆ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే త్వరలో ఈ సినిమా నిజంగా వాయిదా పడిందో లేదో అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.