టాలీవుడ్‌లో వరుస సక్సెస్…లతో స్టార్ డైరెక్టర్ ఎదిగారు కొరటాల శివ. ‘ఆచార్య’ తప్ప ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. ‘దేవర’ కి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాన్నే అందుకుంది. అయితే కొరటాల ఇప్పటివరకు కేవలం అగ్ర హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. కొరటాల ఇప్పుడు ‘దేవర’ చేయాలి. కానీ ఎన్టీఆర్ వేరే కమిట్మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల.. కొరటాల శివ కొన్నాళ్ల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అందుకే ఈ గ్యాప్లో వేరే సినిమా చేయాలని భావించినప్పటికీ.. అతనికి స్టార్ హీరోలు అందుబాటులో లేరు. ఇటీవల కాలంలో నాగ చైతన్య, నందమూరి బాలకృష్ణ వంటి హీరోలకు కొరటాల కథలు వినిపించిండం జరిగింది. ఈ లిస్టులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కూడా ఉన్నట్టు ఇన్సైడ్ టాక్. పవన్ కళ్యాణ్‌ను డైరెక్ట్ చేయాలనే కోరిక కొరటాలకి చాలా కాలంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టు ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడిన సినిమా అచేయాలనేది కొరటాల ఆలోచన.

ఇటీవల పవన్ కళ్యాణ్‌ను కలిసి ఒక కథ కూడా వినిపించాడట కొరటాల.కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ నో చెప్పారట. అందుకు కారణాలు ఏంటి అన్నది స్పష్టంగా తెలీదు. కానీ పవన్ కళ్యాణ్ సుజిత్, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయ్యారు కాబట్టి.. ఆయన బిజీ షెడ్యూల్లో అవి కంప్లీట్ చేయడమే గగనం కాబట్టి.. కొరటాలకి నో చెప్పి ఉండొచ్చు.
ఇప్పుడున్న హీరోల్లో బాలకృష్ణ మాత్రమే కొరటాల శివతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు టాక్. చూద్దాం మరి ఏమవుతుందో!
