రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పర్యటనపై మొదట తీవ్ర ఉత్కంఠను రేపింది. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి హుక్కుంపేట – బాలాజీపేట రోడ్డులో సభ నిర్వహించి శ్రమదానం చేసేందుకు సిద్ధమైన పవన్ ను కొంతసేపటి వరకు పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం కొనసాగింది. ఇక కారు టాప్‌పై కూర్చొని పోలీసులకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ నినాదాలు చేశారు.
ఇక సభ మొదలైన తరువాత వర్షం కురిసినప్పటికి పవన్ కళ్యాణ్ స్పీచ్ మాత్రం ఆగలేదు. పవన్ మరోసారి తన మాటలతో విమర్శకులకి కౌంటర్ గట్టిగానే ఇచ్చారు. రాజకీయాలు నాకు సరదా కాదు. మిగతా రాజకీయ నేతల్లా రాజకీయాలు నా వ్యాపారం కూడా కాదు. నాకు బాధ్యత ఉందని అన్నారు. ఇక ప్రజల హక్కులను ఏ ప్రభుత్వం ఆపలేదు అంటూ నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. రాజ్యాంగ హక్కులను కాల రాయొద్దని అన్నారు.
ఇక కోపాన్ని తారాజువ్వల్లా వదిలేయకండి. కోపాన్ని గుండెల్లో పెట్టుకోండి. సీఎం అయ్యాకే నన్ను సీఎం అని పిలవండి అని అభిమానులకి చెప్పిన పవన్ ఇటీవల విమర్శలపై కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ప్రశ్నిస్తేనే రోడ్ల పనులు చేపడతారా? ప్రజలు ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి అంటూ నా జోలికి వస్తే ఆడ, మడ అని తేడా లేకుండా తాట తీస్తా.. నన్ను తిడితే భయపడతాడని అనుకుంటున్నారా?.. బూతులు తిడితే తొక్కిపెట్టి నార తీస్తా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.