Pawan Kalyan: ‘హరి హర వీరమల్లు’ నుండి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన టీం..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న అప్‌డేట్ రానే వచ్చేసింది. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. కొద్ది రోజులుగా క్షణం తీరిక లేకుండా రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. సినిమాల పరిస్థితి ఏంటి? షూటింగ్ స్టేజ్‌లో ఉన్న ‘హరి హర వీరమల్లు’ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు?.. అనౌన్స్ చేసిన మూవీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? అనే అయోమయంలో ఉన్నారు అభిమానులు.. వారి ఎదురు చూపులకు తెరదించుతూ ‘హరి హర వీరమల్లు’ టీం అప్‌డేట్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్‌లో.. ఎ.దయాకర రావు నిర్మాతగా.. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ మీద సీనియర్ అండ్ సూపర్ హిట్ ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం సమర్పిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం.. ‘హరి హర వీరమల్లు’.. పవన్ కెరీర్‌లో తెరకెక్కుతున్న ఫస్ట్ అండ్ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ఇది.. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్, నర్గీస్ ఫక్రీ కీలకపాత్రల్లో కనిపిచంనున్నారని సమాచారం.17వ శతాబ్దంలో మెఘల్ సామ్రాజ్యానికి చెందిన వీరమల్లు జీవితం ఆధారంగా..

భారీ బడ్జెట్, టాప్ టెక్నికల్ వాల్యూస్‌తో ఈ మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతోంది. మూవీ యూనిట్ ఇచ్చిన అప్‌డేట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.‘‘చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది.. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారాగణం మరియు సిబ్బంది యొక్క అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుండి షెడ్యూల్ ప్రకారం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్‌లో ‘హరి హర వీరమల్లు’ చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది.

పవన్ కళ్యాణ్‌తో పాటు 900 మంది నటీనటులు మరియు సిబ్బంది చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ‘హరి హర వీరమల్లు’ ఒక మైలురాయి చిత్రం అవుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారని మేము చాలా నమ్మకంగా ఉన్నాము. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్నఈ గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం’’ అని తెలిపారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus