పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎంతగా ఇష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హిట్స్ వచ్చినా రాకపోయినా కూడా పవన్ కు ఉన్న ఆదరణ కొంత కూడా తగ్గలేదు. తగ్గదు కూడా. తన సింపుల్ క్యారెక్టర్ తోనే సెలబ్రెటీ దూరాన్ని పక్కనపెట్టే పవన్ ఇటీవల అభిమానుల కోసం ఒక ఫొటోకు స్టిల్ ఇచ్చిన విధానం ఎంతగానో ఆకట్టుకుంటోంది. పవన్ కళ్యాణ్ చాలా వరకు సింపుల్ గానే ఉండడానికి ఇష్టపడతాడని అందరికి తెలిసిందే.
ఇక అభిమానులు కలవడానికి వస్తే ఎలాంటి సందర్భాల్లో అయినా ఫొటోలు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. అయితే ఇటీవల పవన్ కోసమని కొంత మంది అభిమానులు గంటల తరబడి లొకేషన్స్ దగ్గర వెయిట్ చేశారు. అప్పుడు పవన్ వకీల్ సాబ్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు.ఇక అభిమానులందరితో ఫొటో దిగడానికి ఇంట్రెస్ట్ చూపించిన పవర్ స్టార్ అందరూ కనిపించాలని మోకాళ్ళపై కూర్చున్నాడు. పవన్ తీరుకు అభిమానులంతా ఆశ్చర్యపోయారు.
ఇక అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ రోజు అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ షూటింగ్ కోసం క్లాప్ కొట్టిన పవన్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు.