పవన్ సినిమా బడ్జెట్ పెంచేస్తున్నారట
- March 13, 2020 / 12:25 PM ISTByFilmy Focus
పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత మూడు చిత్రాలు ప్రకటించారు. దర్శకుడు శ్రీరామ్ వేణుతో పింక్ మూవీ తెలుగు రీమేక్ వకీల్ సాబ్, దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఓ పీరియాడిక్ మూవీ అలాగే గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తో మరో చిత్రం ఆయన ప్రకటించడం జరిగింది. వకీల్ సాబ్ మూవీ చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. వేసవి కానుకగా ఈ మూవీ మే నెలలో విడుదల కానుంది. క్రిష్ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ మూవీ చిత్రీకరణ కూడా ప్రోగ్రెస్ లో ఉంది. ఈ మూవీ ఇప్పటికే 20శాతం వరకు షూటింగ్ జరుపుకుందని తెలుస్తున్న సమాచారం. హరీష్ శంకర్ మూవీ మొదలుకావాల్సి వుంది. ఆయన ప్రీ ప్రొడక్షన్ పనులు చక్కబెట్టే పనిలో ఉన్నారు.

ఐతే క్రిష్ తో పవన్ చేస్తున్న మూవీ బడ్జెట్ భారీగా పెంచేస్తున్నారట. మొఘలుల కాలం నాటి పీరియాడిక్ మూవీ కావడంతో అప్పటి వాతావరణం తలపించేలా భారీ సెట్స్ నిర్మిస్తున్నారట. ఇక పవన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీగా ఈ చిత్రం నిలవనుందని తెలుస్తున్న సమాచారం. పవన్ లాంటి స్టార్ హీరో చేస్తున్న మూవీ కావడంతో వసూళ్లకు ఢోకా వుందని నిర్మాతలు కాంప్రమైజ్ కాకుండా ఖర్చుపెడుతున్నారట. ఇక పవన్ ఈ మూవీలో రాబిన్ హుడ్ తరహా పాత్ర చేస్తున్నారు. పెద్దలను దోచి పేదలకు పెట్టే దొంగగా ఆయన పాత్ర తీరు వుంటుందని వినికిడి.
Most Recommended Video
యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

















