టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ‘అన్‌స్టాపబుల్’ షోతో సరికొత్తగా ట్రెండ్ సెట్ చేస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ మధ్య దీపావళి సందర్భంగా స్ట్రీమింగ్‌కు వచ్చిన నాలుగో సీజన్ రెండో ఎపిసోడ్‌లో ‘లక్కీ భాస్కర్’ ’ (Lucky Baskhar)మూవీ టీమ్‌ను బాలయ్య ఆహ్వానించారు. హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan), హీరోయిన్ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) , డైరెక్టర్ వెంకీ అట్లూరి (Venky Atluri) , నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi ) ఇందులో గెస్ట్‌లుగా హాజరయ్యారు.
Balakrishna
షోలో భాగంగా బాలయ్య నాగవంశీకి పలు ఆసక్తికర ప్రశ్నలు వేశారు. అందులో ఒకటి ‘మీ జీవితంలో అన్‌స్టాపబుల్ మూమెంట్ ఏంటి?’ అనే ప్రశ్న. దీనికి నాగవంశీ స్పందిస్తూ, 2018లో వచ్చిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ పెద్ద ఫ్లాప్ అయిందని, ఆ సమయంలో చాలా టెన్షన్ ఫీలయ్యానని చెప్పారు. అయితే ఆయన ఆ ఫ్లాప్ మూవీ పేరును చెప్పకపోవడం విశేషం. దీంతో వెంటనే బాలయ్య ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) అని చెప్పేశారు.
అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్ (Trivikram) గారు ఇచ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన జీవితంలో మళ్లీ ట్రాక్ లోకి తెచ్చాయని నాగవంశీ చెప్పారు. 2018లో సంక్రాంతి కానుకగా విడుదలైన అజ్ఞాతవాసి భారీ అంచనాలతో విడుదలైంది కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన చినబాబు (S. Radha Krishna) , నాగవంశీని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించారు, కానీ అనూహ్యంగా అది డిజాస్టర్‌గా మారింది.
అజ్ఞాతవాసి విడుదల సమయంలో బాలయ్య జైసింహ (Jai Simha) చిత్రంతో బాక్సాఫీస్‌లో పోటీకి దిగారు. అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో జైసింహ మూవీ వసూళ్లలో సేఫ్ జోన్‌లో నిలిచింది. ఇప్పుడు బాలయ్య హోస్ట్ చేసిన షోలో అజ్ఞాతవాసి ప్రస్తావన రావడం చర్చనీయాంశమైంది. ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ లో అజ్ఞాతవాసి సినిమా కూడా కొనసాగుతోంది. ఆ సినిమాకు ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఉండేవని గతంలో నాగవంశీ ఒకసారి వివరణ ఇచ్చారు.