కొమరం పులి, ఖలేజా చిత్రాలను నిర్మించిన సింగనమల రమేష్ కు జైలు శిక్ష పడింది. చెక్‌బౌన్స్ కేసులో జైలు శిక్ష విధిస్తూ కర్నూలు ఎక్సైజ్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. రాజశేఖర్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర రమేష్ 15లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నారు. అయితే అతడికి చెల్లని చెక్ ఇచ్చిన కేసులో రమేష్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. చిత్ర పరిశ్రమలో మాఫియా అలజడి రేపారని విమర్శలు ఎదురుకున్న ఈ నిర్మాతకు ఇప్పుడు జైలు శిక్ష పడడం మరోసారి చర్చనీయాంశమైయింది.