Prabhas, Payal Rajput: పాయల్ ని హైలెట్ చేస్తున్న ప్రభాస్ పోస్ట్.. ఎలా అంటే..!

  • May 17, 2024 / 10:06 PM IST

ప్రభాస్ (Prabhas) ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అది పెద్ద సెన్సేషన్ సృష్టిస్తుంది. న్యూస్ ఛానల్స్ లో ఎక్కువగా అదే హెడ్ లైన్, సోషల్ మీడియాలో దాని గురించే ఎక్కువ డిస్కషన్..! ఆ పోస్ట్ తెలుసు కదా.. ‘ఓ స్పెషల్ పర్సన్ మన జీవితంలో భాగం కాబోతున్నాడు. వెయిట్ చేయండి’ అంటూ ప్రభాస్ తన అభిమానులతో పంచుకున్నాడు. అంతే ఈ పోస్ట్ కచ్చితంగా అతని పెళ్లి గురించే అని ఫ్యాన్స్ సీరియస్ గా తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా ఈ పోస్ట్ ట్రెండింగ్లో ఉంది. అంటే ప్రభాస్ పెళ్లి చేసుకోవాలని పాన్ ఇండియా ప్రేక్షకులు కోరుకుంటున్నారు అని అర్థం చేసుకోవచ్చు. అది జరిగితే మంచిదే..! కానీ ఆ పోస్ట్ మాత్రం ప్రభాస్ నెక్స్ట్ మూవీ ‘కల్కి’ (Kalki 2898 AD) సినిమాలో హీరోయిన్ పాత్ర గురించి అనే టాక్ ఇండస్ట్రీ వర్గాల నుండి గట్టిగా వినిపిస్తోంది. అది నిజమే అయితే ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశచెందడం గ్యారెంటీ. అయితే ఈ పోస్ట్ వల్ల హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కి (Payal Rajput) బాగా కలిసొచ్చింది అని చెప్పాలి. ఎలా అంటారా?

ప్రభాస్ పోస్ట్ కి కొన్ని గంటల ముందు పాయల్ కూడా ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టింది. ‘కచ్చితంగా నేను కూడా ఎవరొకరికి డార్లింగ్ అవుతాను’ అని రాసి ఉంది. రెండు పోస్టుల్లోనూ ‘సమ్ వన్'(someone ) అనేది కామన్ గా ఉండటంతో ప్రభాస్ యాంటీ ఫ్యాన్స్ పాయల్ ని హైలెట్ చేస్తున్నారు. పైగా ఓ సందర్భంలో పాయల్ ప్రభాస్ గురించి మాట్లాడిన వీడియోను కూడా పోస్ట్ చేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus