Payal Rajput: స్వాతిగా లక్‌ చేసుకోబోతున్న పాయల్‌..!

‘మోసగాళ్ల’తో ఇటీవల ప్రేక్షకుల మందుకొచ్చారు మంచు విష్ణు. ఆ తర్వాత ఇక ‘ఢీ అంటే ఢీ’ మొదలుపెడతారు అని ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. ‘ఢీ’ స్టైల్‌ వినోదం కోసం ప్రేక్షకులు, అభిమానులు వెయిట్ చేస్తుంటే, ఆ స్థాయి విజయం కోసం విష్ణు వెయిట్‌ చేస్తున్నారు. కానీ విష్ణు ప్లాన్స్‌ వేరేగా ఉన్నాయి. కొత్త సినిమాను విష్ణు సరికొత్తగా ప్రకటించారాయన. ‘గాలి నాగేశ్వరరావు’ అంటూ ఓ మాస్‌ మసాలా సినిమా చేయబోతున్నట్లు చెప్పారు.

ఇషాన్‌ సూర్య అనే కొత్త దర్శకుడి డైరక్షన్‌లో ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమాలో కథానాయిక ఎవరు అనేది కూడా తేలిపోయింది. ‘ఆర్‌ ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌కి పరిచయమై… ఆ తర్వాత సరైన పాత్ర పడక ఇబ్బంది పడుతున్న పాయల్‌ రాజ్‌పుత్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సినిమాలో స్వాతి అనే పాత్రలో నటిస్తున్నాను అని పేర్కొంది పాయల్‌.

ప్రముఖ రచయిత కోన వెంకట్‌ ‘గాలి నాగేశ్వరరావు’ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే సమకూరుస్తున్నారు. దాంతోపాటు క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నారు. ఇక భాను, నందు సంయుక్తంగా మాటలు రాస్తున్నారు. ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అంతకుమించి సమాచారం ఏమీ బయటకు రాలేదు. ‘గాలి నాగేశ్వరరావు’లో విష్ణు పూర్తి మాస్‌ గెటప్‌లో కనిపించనున్నాడు అని విష్ణు సోషల్‌ పోస్ట్‌ చూస్తేనే అర్థమైపోతుంది.

మెడలో ఎర్రటి రుమాలు, పూల పూల చొక్కా, చిరిగిన జీన్స్‌తో ఉన్న ఓ చిన్న అవతార్‌ను విష్ణు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అందులో విష్ణు మంచు యాజ్ గాలి నాగేశ్వరరావు అని రాసుకొచ్చారు. సినిమా పేరు ఇదే అని చెప్పకపోయినా… అదే అవుతుంది అని సినిమా వర్గాలు చెబుతున్నాయి. ఆ ఫొటోలో విష్ణు ఫుడ్‌ ముందు నిల్చున్నట్లుగా ఉంది. అంటే కేటరింగ్‌ నేపథ్యమైనా కావొచ్చు, లేదంటే గాలి నాగేశ్వరారవు ఫుడ్డీ అయినా అయి ఉండాలి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video
S
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus