Phalana Abbayi Phalana Ammayi Twitter Review: ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది..ఎలా ఉందంటే?

యువ కథానాయకుడు నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’. గతేడాది ‘కార్తికేయ2’ ‘ధమాకా’ వంటి రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ నుండి వచ్చిన మూవీ ఇది. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సహ నిర్మాతగా వివేక్ కూచిభొట్ల వ్యవహరించారు.

నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘ఊహలు గుసగుస లాడే’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దీంతో ‘ఫలానా అబ్బాయి.. ఫలానా అమ్మాయి’ చిత్రం పై యూత్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వారి టాక్ ప్రకారం.. ఇది పక్కా యూత్ ఫుల్ మూవీ అని, చాలా స్లోగా ఉంటుందని కానీ మరీ బోర్ కొట్టించే సినిమా అయితే కాదని చెబుతున్నారు.

అవసరాల రాసిన సంభాషణలు బాగుంటాయట. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్ కు తగ్గట్టు ఉంటుందని అంటున్నారు. ఓవరాల్ గా మాస్ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడం కష్టం కానీ మల్టీప్లెక్స్ ఆడియన్స్ కు నచ్చే అవకాశాలు ఉన్నాయని.. పక్కా ఫీల్ గుడ్ మూవీ ఇదని చెబుతున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత వరకు రాణిస్తుందో చూడాలి :

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus