యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ షార్జా హీరోగా నంద కిషోర్ డైరెక్షన్లో.. డి.ప్రతాప్ నిర్మించిన తాజా చిత్రం ‘పొగరు’. చందన్ శెట్టి, అర్జున్ జన్యలు సంగీతంలో రూపొందిన ‘కరాబు మైండు కరాబు’ అనే ఒక్క పాట.. ఈ డబ్బింగ్ సినిమా పై అందరి దృష్టి పడేలా చేసింది. కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడంలో విఫలమయ్యింది అనే చెప్పాలి. అయినప్పటికీ రష్మిక వంటి స్టార్ హీరోయిన్ క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసింది.
ఈ చిత్రం 5 రోజుల కలెక్షన్లను ఓ సారి గమనిస్తే :
నైజాం
0.71 cr
సీడెడ్
0.46 cr
ఉత్తరాంధ్ర
0.30 cr
ఈస్ట్
0.14 cr
వెస్ట్
0.09 cr
గుంటూరు
0.12 cr
కృష్ణా
0.13 cr
నెల్లూరు
0.07 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.02 cr (షేర్)
‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 2.02 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2.27 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఓ డబ్బింగ్ సినిమాకి ఈ ఓపెనింగ్స్ చాలా ఎక్కువే. కానీ బయ్యర్లు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారు కాబట్టి.. వీక్ డేస్ లో సో సోగా పెర్ఫార్మ్ చేస్తే కుదరదు మరి.అయితే బ్యాలన్స్ వసూల్ చెయ్యడం కష్టమనే చెప్పాలి. ఒక్క సీడెడ్ లో మాత్రమే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.