పాన్ ఇండియా సినిమాల కాలం ఇది. ఏ కుర్ర అగ్ర హీరో సినిమా అయినా… పాన్ ఇండియా అనేస్తున్నారు. అంతగా పాన్ ఇండియా ఫీవర్ ఎక్కువైంది. ప్రస్తుతం తెలుగు, తమిళంలో ఇలాంటి సినిమాలు వరుస కడుతున్నాయి. హీరోల సంగతి అలా ఉంచితే… ఇలాంటి వరుస సినిమాల్లో నటించిన కొంతమంది నాయికలు పాన్ ఇండియా హీరోయిన్లు అయిపోతున్నారు. అలాంటివారిలో పూజా హెగ్డే ఒకరు. వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలు చేస్తోందామె. దానికి వెనుక సీక్రెట్ ఏంటి..అంటే ఇలా చెప్పుకొచ్చింది.
పూజా హెగ్డే కెరీర్ ప్రారంభం చాలామంది నాయికల్లా సాధారణంగానే మొదలైంది. తమిళంలో ‘మూగమూడి’అనే సినిమా చేసి ఫర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చేసినా పెద్దగా కలసి రాలేదు. బాలీవుడ్‌కి వెళ్లి ‘మొహంజొదారో’ చేసింది. అక్కడే అదే పరిస్థితి. ఆ తర్వాత ‘దువ్వాడ జగన్నాథమ్’తో రీఎంట్రీ ఇచ్చింది పూజ. ఆ తర్వాత ఇక తిరిగి చూసింది లేదు. మెట్టు మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది.
ఈ క్రమంలో పూజా హెగ్డే ఆలోచన విధానం ఎలా ఉండేదో ఇటీవల చెప్పింది. ఆమె ఈ విషయాన్ని వివరంగా చెప్పినా… మనం షార్ట్‌గా చేసి చూస్తే సూపర్ అనిపిస్తుంది. అదే ‘పని చేయడమే మన చేతుల్లో ఉంది. ఫలితం గురించి పట్టించుకోవద్దు. బాగా పని చేస్తే మంచి అవకాశాలొస్తాయి. అప్పుడు ఇంకా ఉన్నత స్థితికి ఎదగొచ్చు’. ఈ నినాదాన్ని నమ్ముకునే పూజా హెగ్డే పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతుల్లో ‘రాధే శ్యామ్’, ‘సర్కస్’, ‘బీస్ట్’ లాంటి పాన్ ఇండియా సినిమాలున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా ఉన్నాయి.