Pooja Hegde: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హీరోయిన్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ ..!

పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న వరుస సినిమాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. మొదట ‘భవదీయుడు భగత్ సింగ్’ పేరుతో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ అని కూడా ప్రకటించారు. ఆమె పేరు ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ.. సినిమా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. తర్వాత పరిస్థితులు చాలా మారాయి. పవన్ కళ్యాణ్ స్క్రిప్ట్ పరంగా సంతృప్తిగా లేకపోవడంతో.. దర్శకుడు హరీష్ మళ్ళీ తన పెన్ కు పని చెప్పాల్సి వచ్చింది.

‘తేరి’ ఐడియానే తీసుకుని అటు ఇటు మార్చేసి పవన్ ను మెప్పించాడు హరీష్. అది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పేరుతో మళ్ళీ ప్రకటించినట్టు అయ్యింది. మొత్తానికి షూటింగ్ స్టార్ట్ చేసే సమయం వచ్చింది. కానీ హీరోయిన్ పూజ సంగతేంటి. ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు అప్పటికే చాలా కథనాలు వచ్చాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన వారు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నెటిజన్లు .. పూజా హెగ్డే ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నట్టు రాసుకొచ్చారు.

అక్కడితో ఆగకుండా మాళవిక మోహనన్, శ్రీలీల వంటి వారిలో ఒకరు హీరోయిన్ గా ఎంపికయ్యే ఛాన్స్ ఉన్నట్టు కూడా అందులో పేర్కొన్నారు . కానీ స్వయంగా మాళవిక నేను పవన్ సినిమాలో నటించడం లేదు అని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.దీంతో అందరిలోనూ పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిజానికి అసలు విషయం ఏంటంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్టు అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి దర్శకుడు హరీష్ కు .. పవన్ సినిమాని ఎప్పుడు మొదలు పెడతాడు అనే విషయం పై అతనికే క్లారిటీ లేదు.

దీంతో పూజా హెగ్డేకి డేట్స్ ఎప్పుడు ఇవ్వాలి అనే విషయంపై స్పష్టత లేదు. అదీకాక పూజా హెగ్డే .. త్రివిక్రమ్ – మహేష్ బాబు ల సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యింది. అందుకే అంతా ఈ సినిమా నుండి పూజా హెగ్డే తప్పుకున్నట్టు కన్ఫర్మ్ చేసేశారు. ఏప్రిల్ మొదటి వారం నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ ప్రారంభం కానుంది. కాబట్టి.. పూజా హెగ్డే ఈ ప్రాజెక్ట్ లో నటించేది లేనిది అప్పటికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus