టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలిగిన పూజా హెగ్డే (Pooja Hegde) , ఇప్పుడు దాదాపు ఈ ఇండస్ట్రీకి దూరమైనట్టు కనిపిస్తోంది. చివరిసారిగా ఆమె ‘ఆచార్య’లో (Acharya) గెస్ట్ రోల్, ‘ఎఫ్3’లో (F3: Fun and Frustration) స్పెషల్ సాంగ్‌లో కనిపించి మాయమయ్యింది. ఆ తరువాత ఆమెకు పెద్దగా తెలుగు ఆఫర్లు రాలేదు. అయితే బాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో మాత్రం పూజా బిజీగా ఉంది. కోలీవుడ్‌లో నాలుగు, హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమె తిరిగి టాలీవుడ్‌కి రావాలని ఆశిస్తున్నారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజా చేసిన కామెంట్లు అందర్నీ షాక్‌కు గురి చేశాయి. ఆమె చెప్పినదాని ప్రకారం.. తనపై కావాలని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయించారని, అంతటితో ఆగకుండా కోట్లు ఖర్చు చేసి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇది చూసి తన తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని, ట్రోలింగ్ ఆపాలని అడిగితే డబ్బులు డిమాండ్ చేశారట. ఇవి అన్నీ తను ఊహించుకున్నదా, లేక వాస్తవంగానే జరిగాయా అన్నదానిపై నెటిజన్లలో విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
పూజా మాటలను నమ్మేవారు, ఆమెకి గతంలో భారీ క్రేజ్ ఉండటం వల్ల కొందరు ఈవిధంగా కావాలని చేయించి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో మరికొందరు మాత్రం “ఇండస్ట్రీలో అందరినీ ట్రోల్ చేస్తారు, అది ఎంతవరకు వ్యక్తిగతంగా తీసుకోవాలి?” అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పూజా చెబుతున్న ఈ విషయాలు మిగతా హీరోయిన్స్ కూడా తరచూ ఎదుర్కొనే సమస్యలే అనే అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అయితే ట్రోలింగ్‌ను పక్కన పెట్టి ఆమె కెరీర్ వైపు చూస్తే.. కోలీవుడ్‌లో సూర్య (Suriya), రజనీకాంత్ (Rajinikanth) , విజయ్ (Vijay Thalapathy) , లారెన్స్(Raghava Lawrence) లాంటి స్టార్‌లతో సినిమాలు చేస్తోంది.
ఈ ప్రాజెక్టులపై మంచి బజ్ ఉంది. రజనీతో స్పెషల్ సాంగ్, విజయ్‌తో లీడ్ రోల్, లారెన్స్‌తో మాస్ ఎంటర్‌టైనర్ చేయడం పూజాకు మళ్లీ ఫామ్ తీసుకొస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. ఇక బాలీవుడ్‌లోనూ మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఈ సినిమాలు సక్సెస్ అయితే, పూజా మళ్లీ టాలీవుడ్‌లోనూ అడుగుపెట్టే అవకాశం ఉంది. గతంలో అలా చాలా మంది హీరోయిన్స్ తమ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. పూజా హెగ్డేకు సత్తా, అందం రెండూ ఉన్నాయి. అవసరమైనదల్లా ఒక్క హిట్ మాత్రమే. ఈసారి కోలీవుడ్ విజయాలు ఆమెకు తెలుగు చిత్రపరిశ్రమలో మరోసారి బలమైన ప్లాట్‌ఫాం ఇవ్వగలవా చూడాలి.