Poonam Kaur: అన్నీ అబద్ధాలే అంటూ ఫైర్ అయిన పూనమ్ కౌర్.. ఏం జరిగిందంటే?

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పూనమ్ కౌర్  (Poonam Kaur)  తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గతంలో పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) గురించి ఆరోపణలు చేస్తూ కొన్ని ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే త్రివిక్రమ్ చేసిన తప్పేంటనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం దొరకడం లేదు. అయితే ప్రముఖ నటుడు, నిర్మాత చిట్టిబాబు ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూనమ్ కౌర్ గురించి కామెంట్లు చేశారు.

Poonam Kaur

చిట్టిబాబు మాట్లాడుతూ పూనమ్ కౌర్ ట్విట్టర్ లో ట్వీట్ చేస్తారని ఏం జరిగిందో చెప్పాలంటే చెప్పరని కామెంట్లు చేశారు. ఆ అమ్మాయి స్టార్ కావాలని అనుకుందని కాలేదని చిట్టిబాబు పేర్కొన్నారు. ఎవరికి వాళ్లు అందంగా ఉన్నారని అనుకుంటారని కానీ కెమెరా హీరోయిన్ లోపాన్ని బయటపెడుతుందని ఆయన కామెంట్లు చేశారు. ఎవరికి వాళ్లు గొప్ప హీరోయిన్లతో పోల్చుకుంటూ పొగుడుకుంటారని చిట్టిబాబు తెలిపారు.

ఇండస్ట్రీలో తప్పు చేస్తే హీరోయిన్ అవుతారనేది పిచ్చి మాట అని ఆయన పేర్కొన్నారు. పూనమ్ కౌర్ ఆ కామెంట్స్ గురించి స్పందిస్తూ నేను ఇప్పటికే ఫిర్యాదు చేసినా ఎవరూ చర్యలు తీసుకోలేదని చెప్పుకొచ్చారు. మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించరని ప్రశ్నించలేరని ఆమె అన్నారు. నేను మీలా ఫేక్ కాదని మీలా వెన్నుముక లేనిదానిని కాదని పూనమ్ కౌర్ చెప్పుకొచ్చారు.

నన్ను కాకుండా నిర్మాత చిట్టిబాబుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించే దమ్ముందా? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. పూనమ్ కౌర్ రియాక్షన్ నేపథ్యంలో చిట్టిబాబు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. పూనమ్ కౌర్ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరుకుతుందేమో చూడాలి. పూనమ్ వివాదంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. పూనమ్ కౌర్ రాబోయే రోజుల్లో కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకోనున్నారో తెలియాల్సి ఉంది.

సీనియర్లూ.. మీరు మణిరత్నాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి.. జెట్‌స్పీడ్‌లో..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus