సినీ పరిశ్రమలో మరో విషాదం.. క్లాసికల్ డ్యాన్సర్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత హఠాన్మరణం..!

వరుస మరణాలు, ప్రమాదాలు చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి.. ‘కళాతపస్వి’ కె. విశ్వనాథ్, గాయని వాణీ జయరాం మరణ వార్త ఇంకా మర్చిపోకముందే.. నందమూరి తారక రత్న కన్నుమూశారు.. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మైల్ స్వామి, ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్.కె. భగవాన్, సీనియర్ ఎడిటర్ జీ జీ కృష్ణారావు, సీనియర్ నటి బేలా బోస్ వంటి వారు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ కన్నుమూశారు.. బుధవారం (ఫిబ్రవరి 22) మలయాళంలో యాంకర్, యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకున్న సిబి సురేష్ అనారోగ్యంతో మరణించారనే వార్త మర్చిపోకముందే..

క్లాసికల్ డ్యాన్సర్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత హఠాన్మరణం చెందారనే వార్తతో పరిశ్రమ ఉలిక్కిపడింది.. వివరాల్లోకి వెళ్తే.. లెజెండరీ క్లాసికల్ డ్యాన్సర్, పద్మభూషణ్ అవార్డ్ గ్రహీత కనక్ రెలే (85) హఠాన్మరణం చెందారు.. గుండెపోటుతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో గురువారం (ఫిబ్రవరి 23) ఉదయం కన్నుమూశారు.. కనక్ రెలే మోహీని అట్టం నాట్యంలో ప్రావీణ్యురాలు.. అంతేకాదు నలంద నృత్య కళా మహా విద్యాలయ వ్యవస్థాపకురాలు, ప్రిన్సిపాల్ కూడా..

శాస్త్రయ నృత్యానికి ఆమె అందించిన సేవలకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది.. 1937 జూన్ 11న గుజరాత్‌లో జన్మించిన కనక్ రెలే భారతదేశపు అత్యంత సృజనాత్మక శాస్త్రీయ నృత్యకారులలో ఒకరిగా పేరు పొందారు.. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని.. పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వ భారతి విశ్వ విద్యాలయంలో విద్యాభ్యాసం చేశారామె.. కనక్ రెలే మృతికి హేమ మాలిని, సుధ చంద్రన్ వంటి వారితో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus