Prabhas: ఆ విషయంలో ఒత్తిడి వద్దంటున్న ప్రభాస్!

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో పాటు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలామంది హీరోలు ఇప్పటికే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ మాత్రం ఎప్పుడు పెళ్లి చేసుకుంటారనే ప్రశ్నకు అభిమానులకు సమాధానం దొరకడం లేదు. బాహుబలి ది కంక్లూజన్ విడుదలైన తర్వాత ప్రభాస్ పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరగగా ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నా పెళ్లికి మాత్రం దూరంగానే ఉన్నారు. ఒక హీరోయిన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని గతంలో వార్తలు వైరల్ అయినా ప్రభాస్ ఆ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.

అయితే రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా మరోసారి ప్రభాస్ పెళ్లి గురించి స్పందించారు. బాహుబలి రిలీజైన తర్వాత పెళ్లి చేసుకుంటానని అమ్మకు చెప్పానని ప్రభాస్ చెప్పుకొచ్చారు. తన పెళ్లి గురించి కుటుంబంలో చర్చ జరుగుతోందని ప్రతి తల్లి పిల్లలు పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాలని కోరుకుంటుందని ప్రభాస్ కామెంట్లు చేశారు. మా అమ్మ కూడా నేను పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని కోరుకుందని ప్రభాస్ అన్నారు. బాహుబలి సమయంలో మూవీ రిలీజైన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తానని చెప్పానని అయితే ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ లేదని ప్రభాస్ కామెంట్లు చేశారు.

పెళ్లి విషయంలో ఒత్తిడి వద్దని కుటుంబ సభ్యులకు చెబుతున్నానని తనకు కూడా పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని ఉందని అయితే అది సరైన సమయంలోనే జరుగుతుందని ప్రభాస్ అన్నారు. రాధేశ్యామ్ సినిమాలో హస్తసాముద్రికుని రోల్ లో నటించడం తనకు ఆసక్తిగా అనిపించిందని అయితే నా చేతిని మాత్రం ఎప్పుడూ జ్యోతిష్కులకు చూపించలేదని ప్రభాస్ పేర్కొన్నారు. రాధేశ్యామ్ తో మరో సక్సెస్ ను అందుకుంటానని ప్రభాస్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

కొత్త తరహా కథాంశంతో రాధేశ్యామ్ సినిమా తెరకెక్కింది. రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus