ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న మరో భారీ పాన్ ఇండియన్ మూవీ ఆదిపురుష్. రామాయణం నుండి ఓ కొత్త పాయింట్ తీసుకుని, బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీలో టాక్. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్ నటిస్తుండగా, రావణుడిగా బాలీవుడ్ స్టార్ మీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సీత పాత్రకోసం పలువురు హీరోయిన్లు పేర్లు వినిపిస్తున్నా, ఇంకా ఎవరూ ఫైనలైజ్ కాలేదని సమాచారం. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. ఆదిపురుష్ మూవీలో అసలు ట్విస్ట్ ఇదేనంటూ బాలీవుడ్ మాడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు రామాయణ ఇతిహాస గాథ ఎలా పుట్టిందో అందరికీ తెలిసిందే.
దాదాపు అందరికి తెలిసిన రామాయణం ఏంటంటే అందులో రాముడు హీరో, రావణుడు విలన్. ఈ ఇతివృత్తాన్నే బేస్ చేసుకునే ఇండియాలో అనేక సినిమాలు రూపొందించబడి విజయం సాధించాయి.. ఇప్పటికీ రూపొందుతున్నాయి. అయితే ఇప్పుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రంలో మాత్రం కథ వేరేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. రామాయణం గురించి చర్చ వచ్చినప్పుడు ఎక్కువగా రాముడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచిస్తాం, మాట్లాడతాము. అయితే మరోవైపు ఉన్న రావణుడి పాయింట్ ఆప్ వ్యూ గురించి అసలు ఆలోచించం.. అతని క్యారెక్టర్‌ని నెగిటివ్‌గానే చూస్తాం. మన పెద్దలు కూడా మనకు అలానే చెప్పారు.. ఎక్కువ మంది కవులు, రచయితలు కూడా అదే రాశారు.
ఓంరౌత్ మాత్రం ఆదిపురుష్‌లో రావణుడి పాయింట్ ఆప్ వ్యూను కూడా టచ్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ,రావణ యుద్ధంలో ప్రతీకారాన్నే కాకుండా, ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో న్యాయపరమైన కోణం చూపించనున్నారట. అంటే తొలిసారి వెండితెర పై రావణునిలో ఉన్న మానవత్వాన్ని కూడా పరిచయం చేయనున్నాడట దర్శకుడు ఓంరౌత్. మరి ఇందులో నిజమెంతో తెలియదు కానీ బాలీవుడ్‌లో మాత్రం ఈ మ్యాటర్ గురించే చర్చించుకుంటున్నారట. మరి వార్త నిజమో కాదో తెలియాలంటే మేకర్స్ స్పందిచాల్సిందే.