ప్రభాస్ శ్రీరాముడిగా దర్శకుడు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. అయితే టీజర్ విడుదలైన తరువాత కంటెంట్ పై విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వాటిని సరిచేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమా వాయిదా పడనుందని వార్తలొస్తున్నాయి.
తెలుగులో ఈ సినిమాకి పోటీగా చిరంజీవి, బాలయ్య, విజయ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వీటిని దాటుకొని ఎక్కువ థియేటర్లను దక్కించుకోవడం అంత ఈజీ కాదు. పైగా ఈ సినిమాలన్నింటినీ అగ్ర నిర్మాతలు తెరకెక్కించారు. నార్త్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. అందుకే ‘ఆదిపురుష్’ మేకర్స్ ఈ సినిమాను పొంగల్ రేసులో దింపాలని చూస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ సినిమాకి రన్ టైం లాక్ చేసినట్లు సమాచారం. ‘ఆదిపురుష్’ నిడివి 3 గంటల 15 నిమిషాలని సమాచారం.
ఇంత సమయం ఆడియన్స్ థియేటర్ లో కూర్చోవాలంటే కంటెంట్ ఓ రేంజ్ లోఉండాలి . ‘ఆర్ఆర్ఆర్’ సినిమా దీనికంటే పది నిమిషాలు తక్కువ ఉన్నా.. ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వలేదు. జనాలను మెప్పిస్తే ఈ రన్ టైం పెద్ద సమస్యేమీ కాదు. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సినిమా ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారు.
‘సాహో’, ‘రాధేశ్యామ్’ ఇలా రెండు బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తరువాత వస్తోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. పైగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ఫిలిం. అవుట్ పుట్ ఏ మాత్రం తేడా కొట్టినా.. ట్రోలింగ్ తప్పదు. దర్శకుడు ఓం రౌత్ మాత్రం సినిమా విషయంలో చాలా నమ్మకంగా ఉన్నారు. మరేం జరుగుతుందో చూడాలి!